విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బాలీవుడ్ భామ క్ర‌ష్‌

August 12, 2020

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సినిమా.. అర్జున్ రెడ్డి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ సినిమాలో అత‌డి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అలాంటి చిన్న సినిమాలో.. ఒక అప్ క‌మింగ్ హీరో నుంచి అలాంటి పెర్ఫామెన్స్‌ను అస‌లు ఊహించ‌లేం.

ఈ పెర్ఫామెన్స్‌తో దేశ‌వ్యాప్తంగా వివిధ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లోని ప్ర‌ముఖుల్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడ‌త‌ను. అర్జున్ రెడ్డి సినిమా చూసి ఫిదా అయిపోయిన బాలీవుడ్ తార‌లు ఎంతోమంది ఉన్నారు. హీరోయిన్లు కూడా అత‌డికి ఫ్యాన్స్ అయిపోయారు.

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మీరు ఉద‌యం లేచేస‌రికి వేరే ఆర్టిస్టుగా మారే అవ‌కాశం ఉంటే ఎవ‌రిలా ఉండాల‌నుకుంటారు అని బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి క‌పూర్‌ను అడిగితే విజ‌య్ దేవ‌ర‌కొండ పేరే చెప్పింది. ఇంకా కియారా అద్వానీ స‌హా ప‌లువురు బాలీవుడ్ భామ‌లు విజ‌య్‌పై త‌మ అభిమానాన్ని చూపించారు. ఇప్పుడీ జాబితాలోకి అమైరా ద‌స్తుర్ కూడా చేరింది.

తెలుగులో మ‌న‌సుకు న‌చ్చింది, రాజుగాడు సినిమాలో న‌టించిన అమైరాను తాజాగా ట్విట్ట‌ర్లో ఓ నెటిజ‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి అడిగాడు. దీనికి ఆమె బ‌దులిస్తూ.. ‘‘నాకు విజయ్‌ అంటే ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలందరిలో విజయ్‌పై నాకు క్రష్‌ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో ఆయన నటన చూసి మైమరచిపోయాను. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. కాకపోతే అది హిందీ సినిమా అయితే బాగుంటుందని ఆశిస్తున్నాను’ అని చెప్పింది.