లండన్ లో బోనాలు - అతిథులు బ్రిటిష్ ఎంపీలు

July 15, 2019

తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులుహాజరు కావడం తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత రాయబారి ఉన్నతాధికారు కెఇవోమ్ ముఖ్య అతిథులు హాజరై పండుగకు ప్రత్యేక శోభను తెచ్చారు. అనంతరం వారు మన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగు వారు మొదటి స్థానం లో ఉన్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ లో జరుగుతున్న బోనాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ ఇంగ్లాండ్ గడ్డ పై తన నియోజకవర్గంలో బోనాల నిర్వహణ, మన హిందూ సాంప్రదాయ పరిరక్షణకి దోహదం చేస్తుందన్నారు.

ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో మొట్ట మొదటి సారి బోనాలు ( 2011 లో) నిర్వహణ, నా ప్రయత్నానికి సహకరించి ఈ రోజు విశ్వవ్యాప్తంగా బోనాలు నిర్వహణకి దోహద పడ్డ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఆచారాల్ని, సాంప్రదాయాల్ని ప్రచారం చేసే బాధ్యత, సేవా దృక్పథంతో సంస్థ పని చేస్తుందని సంస్థ నియమాల మేరకు కలిసి వచ్చే అందరితో పని చేస్తుందని తెలిపారు. ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి ప్రచారం తరాలు మారిన మన వారికి మన సాంప్రదాయాలు మరిచిపోకుండా చేస్తుందన్నారు.
ఉపాధ్యక్షులు రంగు వెంకట్ మాట్లాడుతూ విదేశాల్లో పుట్టి పెరిగే భారత సంతతికి మన పండుగలు జరపడం చాలా ముఖ్యమని లేకుంటే వారి మూలాలు మరిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కార్యక్రమాన్ని స్థానిక లక్ష్మినారాయణ గుడిలో కార్యదర్శి, మహిళా సభ్యుల ఆధ్వర్యం లో దుర్గా మాతకు బోనం సమర్పించి, ఒడిబియ్యం కట్టించారు. అనంతరం లండన్ పుర వీధుల్లో ''తొట్టె లు, బోనాల''లతో శోభాయాత్ర చేశారు. అనంతరం క్రాన్ఫోర్డ్ కాలేజ్ ఆడిటోరియంలో శ్రీమతి మీనాక్షి అంతరి అధ్యక్షతన నరేంద్ర వర్మ, శ్రీ వాణిల సంయుక్త వక్తలుగా సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి మాత కి బోనాలు సమర్పించి పూజలు జరిపించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల చేత నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమం సాగింది. తెలంగాణ వంటకాలు, శాఖాహార మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు.

సంస్కృతి ప్రచారంలో భాగస్వామ్యమై బోనాలు నిర్వహించిన, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారికి బహుమతి లు అందచేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ బోనాల నిర్వహణ ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా కొనసాగించడానికి సహకరించిన
HDFC, SBI UK, OASIS ACCOUNTS, HYDERABAD BAWARCHI UK, HOTPOT, YUPP TV లకు టీఈఎన్ఎఫ్ సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో మహేష్ జమ్ముల, స్వామి ఆశ, వెంకట్ ఆకుల, మహేష్ చట్ల, బాలకృష్ణ రెడ్డి, శేషు అల్ల, నరేంద్ర వర్మ, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణి, సవిత, సీత, శౌరి, దివ్య, సాయి లక్ష్మి, శిరీష, అశోక్ మేడిశెట్టి, నర్సింహా రెడ్డి తిరుపరి, రాజు కొయ్యడ, రవి కూర, నరేందర్, మల్లేష్ మొదలగు వారు సహకారంతో విజయవంతం అయింది.