హమ్మయ్య ఎకానమీ బతికింది

August 05, 2020

కరోనాకు స్థాయీ బేధాల్లేవు. ఎవరికైనా వస్తుంది. కానీ ఎవరికి వచ్చిందన్నది పాయింటే. కెనడా ప్రధాని భార్యకు కరోనా వచ్చి దేవుడి దయవల్ల కోరుకున్నారు. స్పెయన్ రాణి మారియా థెరిసా చనిపోయారు. ఇవి వేరు. వీరికి ఏమైనా అయితే ఆ దేశాలు మాత్రమే ప్రభావితం అవుతాయి. కానీ అమెరికా, ఇంగ్లండ్ జర్మనీ వంటి ప్రపంచంలోని అత్యంత కీలక దేశాల పెద్దలకు ఏమైనా అయితే.... ఆ భయం ఎకానమీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి కరోనా సోకిన వెంటనే ఒక భయం ఏర్పడింది. 

తాజాగా బోరిస్ జాన్సన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఐసీయులో చేరినపుడు అసలే పెద్ద వయసు ఎటు దారితీస్తుందో అనుకున్నారు కానీ మంచి కాన్ఫిడెన్స్ తో ఉంటూ ఆయన చికిత్సతో త్వరగా కోలుకున్నారు. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. బ్రిటన్ స్ట్రాటజిక్ హెల్త్ అథారిటీ అయిన నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) కు బోరిస్ రుణం తీర్చుకోలేనిది అంటూ కృతజ్జతలు తెలిపారు. మీరు ఇంట్లో ఉండండి... అదే మిమ్మల్ని కాపాడుతుంది అంటూ బోరిస్ పిలుపునిచ్చారు. 

మనం వైరస్ కి భయపడి ఇంట్లో ఉంటుంటే... వైద్య విభాగంలోని డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు, రేడియాలజిస్టులు ఇలా అన్నిరకాల వైద్య సిబ్బంది ప్రాణాలు అడ్డుపెట్టి మనకోసం కష్టపడుతున్నారు. మీ జీవితాలను కాపాడుకోవడం అంటే వారి జీవితాలను మీరు కాపాడటమే అని బోరిస్ ప్రజలను కోరారు. 

బోరిస్ కోలుకోవడం యూరప్ ఎకానమీనే కాదు ప్రపంచ ఎకానమీని ఎంతో కొంత కాపాడినట్టే అనుకోవాలి.