బొత్సా! నీవ‌ల్ల 30 కోట్లు బొక్క‌!!

May 28, 2020

బొత్సా! నీవ‌ల్ల 30 కోట్లు బొక్క‌
అమ్మ‌నా బూతులు తిట్టిన విజ‌య‌సాయిరెడ్డి
మండ‌లి దెబ్బ‌తో విజ‌య‌సాయిపై జ‌గ‌న్ ఆగ్ర‌హం


శాస‌న‌మండ‌లిలో స‌భ్యుల్ని కొనేశాం అన్నారు.. బిల్లుకు ఎటువంటి అడ్డంకులు ఉండ‌వ‌ని చెప్పారు..తీరా మండ‌లిలో బిల్లు సెలెక్ట్ క‌మిటీకి చేరింది.. ఫ్లోర్ మేనేజ్మెంట్‌కి తీసుకున్న 30 కోట్లు నాకు బొక్క అంటూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాన‌స‌మండ‌లిలో కొంద‌రు ఎమ్మెల్సీల‌ను కొనుగోలు చేసేందుకు విజ‌య‌సాయి వ్యూహం సిద్ధం చేశారు. ఆ బాధ్య‌త‌లు బొత్స‌, పేర్నినాని, అనిల్‌ల‌కు అప్ప‌గించారు. అయితే ఇచ్చిన 30 కోట్లు పోతుల సునీత‌కు 15, శివానంద‌రెడ్డి 15 కోట్లిచ్చామ‌ని, మిగిలిన కొంద‌రు ఎమ్మెల్సీలు త‌మ‌కు ట‌చ్లో ఉన్నార‌ని విజ‌య‌సాయిని బొత్స న‌మ్మించారు.

దీంతో టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్సీలు త‌మ గుప్పిట్లో ఉన్నారంటూ త‌న వెబ్‌సైట్‌లో వార్త‌లు కూడా రాయించుకున్నారు. అలాగే సాక్షిలో క‌థ‌నాలు వండి వార్చారు. దుష్ట‌చ‌తుష్ట‌యం అయిన సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి శాస‌న‌మండ‌లితో సంబంధంలేక‌పోయినా అక్క‌డే మ‌కాం వేశారు. కొంద‌రు ఎమ్మెల్సీల‌ను కొనుగోలు చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. మ‌రికొంద‌రిని బెదిరించి లొంగ‌దీసుకోవాల‌నుకున్నారు. ఇవేమీ సాధ్యం కాక‌పోవ‌డంతో ఒకానొక ద‌శ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర అస‌హ‌నంతో మండ‌లి చైర్మ‌న్‌పై దూష‌ణ‌ల‌కు దిగారు. చంద్ర‌బాబు చాణ‌క్యం, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు చాతుర్యం, చైర్మ‌న్ ష‌రీఫ్ నిజాయితీతో బిల్లు సెలెక్ట్ క‌మిటీకి వెళ్లింది. దీంతో ఆగ్ర‌హోద‌గ్రుడైన విజ‌య‌సాయిరెడ్డి బొత్సా నీవ‌ల్ల 30 కోట్లు బొక్క‌, ఇంత మంది మంత్రులుండి ఏం పీకారంటూ అమ్మ‌నాబూతులు తిట్టాడు. మంత్రులంతా విజ‌య‌సాయిరెడ్డి తిట్ల‌కు క‌నీసం ఎదురుచెప్ప‌కుండా మౌనంగా ఉండిపోయారు.

సీన్ క‌ట్ చేస్తే విజ‌య‌సాయిరెడ్డి తాడేప‌ల్లి ఇంటికి చేర‌గానే..లోప‌లికి వ‌ర‌కూ రాకుండానే జ‌గ‌న్ బూతులందుకున్నార‌ట‌. అప్ప‌గించిన ఒక్క ప‌నీ స‌రిగ్గా చేయ‌వు. ప‌బ్లిసిటీ పిచ్చ ఎక్కువైంది నీకంటూ వీసారెడ్డితో బ్యాటింగ్ ఆడార‌ట‌. ఒకానొక ద‌శ‌లో చేయి చేసుకుంటాడేమో అనేంత‌గా జ‌గ‌న్ ఊగిపోయార‌ట‌.