జగన్ చెబుతున్న ‘బోస్టన్’ భాగోతం ఇదే

February 17, 2020

ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పెను కలకలమే రేపిందని చెప్పాలి. విపక్షాలు సంధిస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడం మానేసిన జగన్ సర్కారు... తాను అనుకున్న పనిని సైలెంట్ గానే చేసుకుపోతుండటం నిజంగానే ఆసక్తికరమే. అమరావతి రాజధాని తరలింపును ఏదో తన సొంతింటి వ్యవహారంలా భావిస్తున్న జగన్... అసలు తీను తీసుకుంటున్న నిర్ణయం ప్రజామోద యోగ్యమైనదా? కాదా? అన్న దిశగా అసలు ఆలోచనే చేయడం లేదన్న విమర్శలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

రాజధానిపై వేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకముందే... అసెంబ్లీలో సీఎం హోదాలో జగనే ప్రకటన చేయడం చూస్తుంటే... నిజంగానే రాజదాని తరలింపుపై ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా జగన్ పట్టించుకునే స్థితిలో లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ చెబుతున్న బీసీజీ నివేదికపై విపక్షాలు... ప్రత్యేకించి టీడీపీ ఆసక్తికర విషయాలను బయటకు లాగాయి. జగన్ మాదిరే ఈ బీసీజీది అవినీతి భాగోతమేనని, అసలు పాలనా సంబంధ విషయాల్లో సదరు కంపెనీకి వీసమెత్తు అనుభవం కూడా లేదన్న విషయాన్ని కూడా టీడీపీ బయటపెట్టేసింది. మరి ఈ బీసీజీ భాగోతమేంటో మనం కూదా చూద్దాం పదండి.

బీజీసీ అంటే... బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. అమెరికాలో ఎప్పుడో 1963లో పుట్టిన ఈ కంపెనీ... తదనంతర కాలంలో 50 దేశాలకు విస్తరించి ఏకంగా 90 బ్రాంచ్ ఆఫీసులను నిర్వహిస్తోంది. రిచ్ లెసర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయా దేశాలకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాజెక్టులను రూపొందించడమే బీసీజీ పని అంట. అయితే ఇప్పటిదాకా ఏ దేశానికి కూడా ఆ కంపెనీ రాజధాని గానీ, పాలనాపరమైన ఇతరత్రా సేవలు అందించిన అనుభవమే లేదట. ఏపీ రాజధానిపై బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్ ఆధారంగా రాజధానిపై అధ్యయనం చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేనట. ఇప్పటిదాకా ఈ కంపెనీ మన దేశంలోని ముంబై, న్యూ గోవా, పారాదీప్, విశాఖ, ఎన్నూర్, చెన్నై, చిదంబరం పోర్ట్ ట్రస్ట్, కాండ్లా, కోల్ కతా, న్యూ మంగళూరు, కొచ్చిన్ పోర్టుల అభివృద్దికి సంబంధించి సలహాలు , సూచనలు అందజేసిందట. అయితే ఇప్పటిదాకా ఈ కంపెనీ రాధాని గానీ, పాలనాపరమైన వ్యవహారాలపై అసలు అధ్యయనమే చేయలేదట. రాజధాని ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనంపై అసలేమాత్రం అనుభవం లేని ఈ కంపెనీకి ఇప్పుడు ఏపీ రాజధానికి సంబంధించిన అధ్యయనం చేయాలని కోరిన జగన్ సర్కారు... అసలు దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేయలేదట. 

ఇక ఈ కంపెనీ గత చరిత్ర అంతా కూడా అవినీతిమయమేనట. అసలు ఈ కంపెనీనే ఓ భోగస్ కంపెనీ అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీజీపై 100 మిలియన్ పౌండ్ల మేర అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయట. ఈ సంస్థ ఘనకార్యాలపై పోర్చుగీసు ప్రభుత్వం ఏకంగా విచారణ కూడా జరిపిందట. అంతేకాదండోయ్... ఇప్పుడు ఈ కంపెనీకి జగన్ సర్కారు ఎందుకు రాజధాని అధ్యయన బాధ్యతలు కట్టబెట్టిందన్న విషయంపైనా ఆసక్తికర కోణం ఉందట.  బీసీజీ డైరెక్టర్ గా ఉన్న భట్టాచార్యకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండేనట. విశాఖ, విజయనగరం మధ్యలో రోహిత్ రెడ్డికి ఓ ఫార్మా కంపెనీ ఉండగా... రాజదానిపై ముందుగానే జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసుకున్నాడట. అంటే... వైసీపీలో నెంబర్ టూగా ఉన్న సాయిరెడ్డి... తన అల్లుడి స్నేహితుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి రాజధాని అధ్యయన బాధ్యతలు అప్పగించారన్న మాట. ఇదీ జగన్ నోట నిత్యం వినిపిస్తున్న బీసీజీ ఘన చరిత్ర.