జగన్ ని అడ్డంగా బుక్ చేసిన బొత్స

October 17, 2019

ఎదుటివారిపై ఒకవేలు చూపితే... నాలుగేళ్లు మనవైపు చూస్తుంటాయి అని పెద్దలు ఊరికే అనలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాజీ ప్రభుత్వంపై నిందలు వేసి బతికేద్దామంటే... కుదురుతుందా? సాక్ష్యాలు, ముద్రలు చెరిగిపోతాయా? అందుకే పదవిలో ఉండేటపుడు పరిమితులు ఉంటాయి. చూసుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి జాగ్రత్త లేకపోవడం వల్లే గతంలో బొత్స సత్యానారాయణ ’సొమ్ములు పోనాయి ఏటి సేత్తాం’ అని సింపుల్ గా చెప్పేశారు. అలాంటి వ్యక్తి మళ్లీ మంత్రి అయితే... ప్రజలు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోరు. తాజాగా బొత్స మళ్లీ తన అజ్జానాన్ని ప్రదర్శించి అడ్డంగాబుక్కయ్యారు. తాను బుక్ అవడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ ని బుక్ చేశారు. దారుణం ఏంటంటే దీనికి సాక్ష్యం సాక్షి పేపరే.
ఇంతకీ ఏం జరిగిందంటే... ఇటీవలే లోకేష్ వైఎస్ హయాంలో కట్టిన సింగిల్ గదుల ఇళ్లను, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లను పోల్చి చూపిస్తూ... అప్పట్లో ఇల్లే కట్టకుండా 4 వేల కోట్లు వైఎస్ అండ్ కో మింగేశారని ఆధారాలతో సహా ట్వీట్ చేశారు. జగన్ కు తెలియకపోతే ఎలా మింగారో బొత్సను అడగాలంటూ చెప్పారు. దీంతో బొత్సకు మండింది. ఆయన మీడియా ముందుకు వచ్చి... తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు అంటూ నోటికొచ్చింది వాగి వెళ్లిపోయారు. దానికి ఒక ఆధారమూ లేదు. ఏమీ లేదు. అయితే, బొత్స మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. గృహనిర్మాణ శాఖతో వివరాలు తెలుసుకోకుండానే ఇల్లే కట్టలేదు అనేశాడు. కానీ గవర్నమెంట్ హౌసింగ్ వెబ్ సైట్ మాత్రం ప్రభుత్వం హౌసింగ్ పథకం కింద ఎన్ని ఇళ్లు కడుతున్నది, ఎన్ని ఇళ్లు కట్టినది, ఎన్ని ఇళ్లు ప్రారంభించాల్సి ఉన్నది వివరంగా పేర్కొంది. ఇపుడు కూడా చూడొచ్చు. గృహ నిర్మాణ శాఖా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం 8,41,548 గృహాల నిర్మాణం పూర్తయినట్లు, మరో 4,39,343 గృహాల నిర్మాణం వివిధ స్థాయిల్లో ఉన్నట్లు, 3,62,693 గృహాల నిర్మాణం మొదలు పెట్టాల్సి ఉన్నట్లు స్పష్టంగాపేర్కొంటోంది.
మరి ఇపుడు గవర్నమెంటు చెప్పింది అబద్ధమా? బొత్స చెప్పింది అబద్ధమా? బొత్సను గుడ్డిగా నమ్మేసి సాక్షిలో ఆయన మాటలు అచ్చేయడంతో బొత్స మాటలకు సాక్ష్యాలున్నాయి. మరి బొత్స మాటలతో ఆనాడు వైఎస్ బుక్కయ్యారు. ఈనాడు జగన్ బుక్కయ్యారు... మరీ ఇంత పచ్చి అబద్ధాలు చెబితే ప్రజల చేతిలో సోషల్ మీడియా ఉంది బొత్సగారు. నిజాలు దాచలేం. చూస్తుంటే.. రెండున్నరేళ్ల తర్వాత జగన్ పీకేసే మంత్రుల్లో బొత్స ముందు వరుసలో ఉంటారేమో.