లక్ష కోట్లు ఎక్కడ? 1500 కోట్లు ఎక్కడ ?

January 21, 2020

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనూ మంత్రి పదవులు చేపట్టారు. కానీ రాజధాని విలువ ఏంటో ఆయనకు తెలియడం లేదా, బీజేపీ మెప్ప కోసం నటిస్తున్నారా? అన్నది అర్థం కావడం లేదు. కేంద్రం 1500 కోట్లు ఇస్తే రాజధానిలో అన్నీ తాత్కాలిక నిర్మాణాలే కట్టారు అని అంటున్నారు బొత్స సత్యనారాయణ. ఆయన హైదరాబాదులో ఒక స్టార్ హోటల్ లో హెయిర్ కట్ చేయించుకుంటారు. ఇపుడు దాని వాల్యూయే ఉంటుంది 1500 కోట్లు. ఇక ఆ డబ్బుతో రాజధానిలో ఏం కట్టాలో ఆయనకే తెలియాలి. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే కట్టారు అని చెబుతున్నారు బొత్స గారు. మరి అవేమైనా రేకులా షెడ్లా? బాబు తన సత్తా చూపడానికి హై ఎండ్ ఆర్కిటెక్చర్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు. అందుకుని ఉన్నవాటిని తాత్కాలికం అనకపోతే కొత్తది కొట్టడానికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒరిజినల్ బిల్డింగులకు కూడా తాత్కాలికం అన్న ట్యాగు తగలించారు.
ఇపుడు ఆ డబ్బులతో కట్టినవే బొత్స, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ కట్టిన బిల్డింగులు. మరి అవి డబ్బుతో కట్టలేదా? హైకోర్టు డబ్బు లేకుండానే కట్టారా? అసెంబ్లీ ఎలా వచ్చింది? మంత్రి గారు అసలు రాజధానిలో కట్టిన ’తాత్కాలిక నిర్మాణాలు‘ అని పేరున్నంత మాత్రాన అవి తాత్కాలిక నిర్మాణాలు అయిపోతాయా? ఎవరికి తెలియదు అని 1500 కోట్ల గురించి ఆయన లెక్క అడుగుతున్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి 5 వేల కోట్ల వర్త్ ఆగిపోయిందని స్వయానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపించారు. కానీ 1500 కోట్లు ఏం చేశారో కేంద్రం ఇచ్చినవి బొత్స అంటున్నారు.
వాస్తవానికి ఏపీ రాజధాని అమరావతికి ఒక రూపు రావాలంటే.. లక్ష కోట్లు అవసరం అవుతాయని అంచనా. కేంద్రం ఢిల్లీకి మించిన రాజధాని కట్టిస్తానని హామీ ఇచ్చి గుండు సున్నా పెట్టింది. మొన్నటి బడ్జెట్లో అయితే మరీ నీచంగా 22 కోట్లు ఇచ్చారు. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి నేతలు కేంద్రాన్ని ఏకిపడేస్తే... మన ముఖ్యమంత్రి జగన్ ఆయన టీం మాత్రం... బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. కొత్తగా ప్రకటించిన విద్యా సంస్థలకు 11 వేల కోట్లకు గాను కేంద్రం 1000 కోట్లు ఇచ్చింది. అది కూడా ఐదేళ్లలో విడతల వారీగా. ఇక మొత్తం డబ్బు ఎప్పటికి వస్తుందో!
ఇంకో విషయం... అమరావతి గురించి వీరు ఆందోళన వ్యక్తంచేశాక రాష్ట్రంలో వేర్వేరు సిటీల్లో ధరలు పెరిగాయట. అది చంద్రబాబుకు ఇష్టం లేదని, అమరావతిలోనే ధరలు పెరగాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు బొత్స చెప్పారు. బొత్సకు తెలియాల్సిన విషయం ఏంటంటే... అమరావతి కంటే... ఆయన చెప్పిన ఇతర నగరాల్లో ఎప్పటి నుంచో భారీ గా ఉంది రియల్ ఎస్టేట్. 151 సీట్లు గెలిచినంత మాత్రాన వైసీపీ వాళ్లు మాట్లాడిన ప్రతిమాటను జనం నమ్ముతారని అర్థం కాదు కదా.

ఇదిలా ఉంటే... బొత్స సుజనా మీద ఒక ఎపిసోడ్ మాట్లాడారు ఈరోజు. సుజనాకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో నాకు తెలుసు అని, త్వరలో అన్నీ బయటపెడతాను అని అన్నారు. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయన్న మంత్రి బొత్స వెల్లడించారు. చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఆయన కంపెనీకి 110 ఎకరాలు వున్నాయని చెప్పారు. యలమంచిలి రుషికన్య పేరుతోనూ సుజనకు భూములు ఉన్నాయని బొత్స ఆరోపించారు. మరి వారు ఆయనకు బినామీలా బంధువులా అన్నది బొత్స చెప్పలేదు. అయితే... టెక్నికల్ ఎవరి పేరు మీదున్న భూములు వాళ్లవే. ఇలా బహిరంగంగా బొత్స చేసిన ప్రకటనపై రేపు సుజనా ఏం కౌంటర్ ఇస్తారో చూడాలి. 

Read Also

చంద్రబాబు ట్వీటేస్తే పనులైపోతున్నాయి
బాబు నోటి నుంచి పేటీఎం బ్యాచ్...!
రాజధాని మార్పు: టెస్టింగ్ మోడ్ లో జగన్ ??