తెలుగోడిని కన్నడలో వాయించేస్తున్నారు

February 24, 2020

విడుద‌ల‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన డియ‌ర్ కామ్రేడ్ ఈ శుక్ర‌వారం విడుద‌ల కావ‌టం తెలిసిందే. మిక్సెడ్ టాక్ న‌డుస్తోంది. తొలిరోజు క‌లెక్ష‌న్ల జోరు బాగానే ఉన్నా.. సినిమా క‌లెక్ష‌న్లు ఇంత స్ట‌డీగా ఉంటాయా? అన్న‌ది సందేహముంది. ఇలాంటివేళ‌.. డియ‌ర్ కామ్రేడ్ కు షాక్ త‌గిలే ప‌రిణామం ఒకటి చోటు చేసుకుంది. భాషాభిమానం ఎక్కువ‌గా ఉండే ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క ఒక‌టి.
డియ‌ర్ కామ్రేడ్ ను క‌న్న‌డ‌లో కూడా విడుద‌ల చేయ‌టం తెలిసిందే. అయితే.. క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌న్న‌డ వెర్ష‌న్ కంటే ఎక్కువ‌గా తెలుగు వెర్ష‌న్ ను విడుద‌ల చేయ‌టంపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కావాల‌నే త‌మ‌పై తెలుగును రుద్దుతున్నారంటూ మండిప‌డుతున్నారు.
ఇందులో భాగంగా #BoycottDearComrade పేరుతో హ్యాగ్ టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తెలుగు కామ్రేడ్ కు ద‌క్కిన‌న్ని థియేట‌ర్లు క‌న్న‌డ వెర్ష‌న్ కు ద‌క్క‌క‌పోవ‌టంపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ చిత్రంలో క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ర‌ష్మిక న‌టించ‌టం.. ఈ సినిమాకు కేజీఎఫ్ హీరో య‌ష్ హాజ‌రు కావ‌టంతో ఈ సినిమాకు మాంచి హైప్ క్రియేట్ అయ్యింది.
అలాంటిది విడుద‌ల‌కు వ‌చ్చేస‌రికి తెలుగు వెర్ష‌న్ కు ఎక్క‌వ థియేట‌ర్లు ఇచ్చి.. క‌న్న‌డ‌కు త‌క్కువ థియేట‌ర్లు కేటాయించ‌టం స‌రికాద‌ని.. అందుకే.. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాష్ టాగ్ పెట్టి మ‌రీ ట్రెండింగ్ చేస్తున్నారు. భాషాప‌ర‌మైన ఎమోష‌న్ విష‌యంలో వెనువెంట‌నే క‌నెక్ట్ అయ్యే క‌న్న‌డిగుల్లో భావోద్వేగం పీక్స్ వెళ్లే లోపు.. చిత్ర నిర్మాత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.