పొరపాటున బీజేపీకి ఓటు వేసినందుకు ...

July 12, 2020

ఓటు వేయ‌టానికి ముందే ఎక్క‌డ వేయాలి? ఏ పార్టీకి వేయాల‌న్న విష‌యం మీద ఫుల్ క్లారిటీతో ఉంటాం. కానీ.. ఒక యువ‌కుడు ఒక పార్టీకి ఓటు వేయాల్సింది పొర‌పాటున మ‌రో పార్టీకి వేసిన వైనం అత‌డ్ని విప‌రీతంగా వేధించింది. త‌న కార‌ణంగా దొర్లిన త‌ప్పున‌కు అత‌గాడు విధించుకున్న శిక్ష తెలిసిన వారు షాక్ తింటున్నారు. ఒక పార్టీని అభిమానించ‌టం ఓకే కానీ.. మ‌రీ ఈస్థాయిలోనా? అంటూ షాక్ తింటున్నారు. ఎందుకంటే.. తాను త‌ప్పుగా ఓటు వేసినందుకు శిక్ష‌గా.. వేలును న‌రికేసుకోవ‌ట‌మే దీనికి కార‌ణం.
ఈ విచిత్ర‌మైన ఉదంతం ఎక్క‌డ చోటు చేసుకున్న‌దంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బులంద్ ష‌హ‌ర్ లో జ‌రిగింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీగా బోలా సింగ్ పోటీ చేస్తున్నాడు. ఎస్పీ.. బీఎస్పీ అభ్య‌ర్థిగా మ‌హాకూట‌మి త‌ర‌ఫున యోగేశ్ వ‌ర్మ బ‌రిలో నిలిచారు. రెండో ద‌శ‌లో పోలింగ్ లో భాగంగా గురువారం పోలింగ్ జ‌రిగింది.
ఈ ఎన్నిక‌ల్లో ఎస్పీ.. బీఎస్పీ అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని భావించారు. ప‌వ‌న్ కుమార్. తాను అనుకున్న‌ట్లే ఓటు వేయాల్సి ఉన్నా.. పొర‌పాటుగా బీజేపీ అభ్య‌ర్థికి ఓటు వేశాడు. దీంతో విప‌రీత‌మైన అస‌హ‌నానికి గురైన అత‌డు.. భ‌రించ‌లేక ఓటు వేసిన వేలిని క‌ట్ చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ వీడియో విడుద‌ల చేశారు. దీంతో.. ఇత‌గాడి చ‌ర్య‌కు ప‌లువురు అవాక్కు అవుతున్నారు.