బీఎస్పీ జ‌న‌సేనుడిని గట్టేక్కించేనా

July 03, 2020

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన తొలి సారి పోటీ చేస్తుంది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌కు గ‌తంలో పోటీ చేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికి ప‌వ‌న్ పార్టీ మాత్రం ఇదే మొద‌టి సారి కావ‌డంతో వ్యూహాత్మ‌కంగా వ్య‌వహ‌రించాల‌ని భావిస్తోంది. ఈ నేప‌ధ్యంలో అనేక త‌ప్ప‌ట‌డుగులు వేసిన‌ప్ప‌టికి ఎన్నిక‌ల ముందు వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత మొదటగా బిజెపి, టిడిపికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత ఒంట‌రిగా పోరు మొద‌లు పెట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేర‌కు అభ్యర్థులను రంగంలోకి దింపారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ మేలు జ‌రుగుతుంద‌ని జ‌న‌సేన శ్రేణులు చెబుతున్నాయి, పవన్ కళ్యాణ్ లాంటి యువనాయకుడు రావడంతో జనసేన పార్టీతో మాయావతి కూడా పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. మోడీపై ఉన్న కోపం, పవన్ కళ్యాణ్ దూకుడు నచ్చి మాయావతి జనసేన పార్టీకి బాగా దగ్గరయ్యారు. ఎస్సి, ఎస్టి, వెనుకబడిన తరగతుల కులాల వారు మొత్తం బిఎస్పీ పార్టీ వైపు ఉండటంతో ఏపిలో ఆ సామాజికవర్గం నేతలు కూడా ఉండటంతో బాగా కలిసొస్తుంద‌న్న ప‌వ‌న్ ఆశిస్తున్నాడు. ఎక్కడ సభ జరిగినా గతంలో కన్నా ప్రస్తుతం మాయావతిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉన్నాడ‌ట‌.

అయితే బీఎస్పీ తో ఓటు బ్యాంకు ఎంత వ‌ర‌కు కొల్ల‌గొట్ట‌గ‌ల‌మ‌ని ఆలోచ‌న ఇప్పుడు అభిమానుల మ‌నసును తొలుస్తున్న ప్ర‌శ్న‌. వాస్త‌వానికి ఏపీలో క‌మ్మ‌, రెడ్డి, కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌పై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. కొన్ని పార్టీలు బీసీల‌ను ఆక‌ట్టుకునేందుకు తాయిలాలు ప్ర‌క‌టిస్తున్నాయి. ద‌ళిత వ‌ర్గం కూడా ఏపీ ఎన్నిక‌ల్లో కీల‌కం మార‌నున్న‌ది. ఇది గుర్తించిన జ‌న‌సేన మిగ‌తా పార్టీల‌ను ప‌క్క‌కు తోసి తాను ఆక‌ర్షించ‌గ‌లిగితే గంప గుత్త‌గా వారి ఓట్ల‌ను పొందొచ్చు అని భావిస్తున్నారు. త‌న స్టార్ ఇమేజ్ కొంత మేర‌కు ప‌నిచేస్తుంద‌ని బావించిన ప‌వ‌న్ బీఎస్పీ అండ తీసుకున్నాడు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల పార్టీగా బీఎస్పీకి పేరుంది. రెండు మూడు రాష్ట్రాల్లో బీఎస్సీ మంచి ఫామ్‌లో ఉంది. అయితే మ‌మ‌త బెన‌ర్జీ మంత్రం ఓట‌ర్ల మీద ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో అనేక స్థానాల్లో బీఎస్పీ అభ్య‌ర్ధులు పోటీ చేసారు. వారికి మ‌ద్ద‌తుగా మాయావ‌తి హైద‌రాబాద్‌లో ప్ర‌చారం చేసారు. కాని ఎక్క‌డా కూడా ఆ పార్టీ ఓట‌ర్ల‌ను ప్ర‌బావితం చేయ‌లేక‌పోయింది. బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాల ఓట‌ర్లు కూడా బీఎస్సీ వైపు మొగ్గు చూపించ‌లేదు. ఈ క్ర‌మంలో ఏపీలో బీఎస్సీ జ‌న‌సేనుడికి ఏ మేర‌కు స‌హాయ ప‌డుతుందో చూడాలి.