బీటెక్ విద్యార్థులు ఇది వైరల్ చేశారు

August 10, 2020

బీటెక్ విద్యార్థులపై వచ్చినన్ని జోకులు ఇంకెవరి మీదా ఉండవు. ఇంటర్నెట్ ఫుల్లుగా వర్గం ఏదైనా ఉందంటే అది వీళ్లే. ఇక దేశంలో అత్యధిక నిరుద్యోగులు కూడా వీళ్లే. ఏపీ తెలంగాణలు బీటెక్ విద్యార్తులను తయారుచేసే ఫ్యాక్టరీలుగా మారిపోవడంతో పుంఖానుపుంఖాలుగా విద్యార్తులు పుట్టుకొస్తున్నారు. 

ఇది సరే.... పెద్ద సంఖ్యలోఉండే వీరి పరీక్షలు కరోనా వల్ల అర్ధంతరంగా ఆగిపోయాయి. ఎంతకీ కరోనా మనల్ని విడిచేలా లేకపోవడంతో వీరి పరీక్షలను ఎలాగైనా పెట్టేయాలని గవర్నమెంటు నిర్ణయం తీసుకుంది. మిగతా ఎవరివి ఆపినా వీరివి ఆపలేం. అలా చేస్తే ఏడాది పాటు అనేక ఇతర ఎగ్జామ్స్ రాసే అర్హత కోల్పోతారు. అందుకే  అక‌డ‌మిక్ ఇయ‌ర్ నష్టపోకుండా ఉండేందుకు నిట్‌, ఐఐటీలు.. బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయి. ఆ వార్త ఇలా వచ్చిందోలేదో బీటెక్ విద్యార్తులు వైరల్ చేశారు.

ఇళ్ల వద్ద పరీక్షలంటే మామూలుగా ఉంటుందా... మాస్టార్లుండగానే కాపీ కొట్టగలిగిన తెలివైన బ్యాచ్ ఇది. మరి ఇంటి నుంచే పరీక్షలంటే ఇంకా చించేస్తారేమో. అయినా తప్పక ఇక ఇళ్ల వద్దనుంచే స్టూడెంట్స్  ఎగ్జామ్స్ రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రభుత్వం ఎత్తులు, విద్యార్థుల పై ఎత్తులు ఎలా ఉంటాయో చూడాలి మరి. 

​దీనికోసం  ఐఐటీ తిరుపతి, తాడేపల్లిగూడెం నిట్ స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయ​ట​. తొలుత తాడేపల్లిగూడెం నిట్​ ఆఖరి ఏడాది విద్యార్తులకు ​ జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్​ జరుగుతాయి. అయితే బీటెక్ విద్యార్తుల టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి... కాలేజీల్లో నిర్వహించిన మిడ్‌, మైనర్ ఎగ్జామ్స్ కు 75% వెయిటేజ్‌​ ఇచ్చి... ఈ పరీక్షలకు మిగతా 25%​ వెయిటేజీ ఇస్తారు.

​కాపీ నిరోధించడానికి​ స్పెష‌ల్ సాఫ్ట్‌వేర్​ లో  విద్యార్థి తన కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేస్తేనే క్వ‌చ్చ‌న్ పేప‌ర్ డౌన్‌లోడ్‌ అవుతుంది.​ ఈ కెమెరాయే ఇన్విజిలేటర్.​