అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా బుచ్చి రాంప్ర‌సాద్ విరాళం

February 24, 2020

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ద‌శ‌-దిశ‌ను మార్చే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించి వేర్వేరు ప్రాంతాల్లో ప‌రిపాల‌న పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తిలో రైతులు, ప్ర‌జ‌లు ఈ మేర‌కు ఆందోళ‌న చేస్తున్నారు. అయితే, ప్ర‌ముఖ ఎన్నారై బుచ్చి రాంప్రసాద్ ఈ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు బాట‌లో సాగుతూ బుచ్చి రాంప్రసాద్ అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా నిలిచి విరాళం అంద‌జేశారు.
అమరావతిలో పరిధిలోని మందడంలో రైతులు చేస్తున్న దీక్షలకు చంద్రబాబు దంపతులు మద్దతు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పాల్గొన్న బుచ్చి రాంప్ర‌సాద్ ఈ సంద‌ర్భంగా రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా తానుంటాన‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఎన్నారైగా మాతృభూమికి సేవ చేయ‌డం త‌న బాధ్య‌త అని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా రూ.50,000 మొత్తాన్ని అందించారు.
అమ‌రావ‌తిలో రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికిన బుచ్చి రాంప్ర‌సాద్ ఈ సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా రూ.50,000 విరాళాన్ని అందించారు. అమ‌రావ‌తికి అండ‌గా ఉండ‌టం త‌న బాధ్య‌త అని పేర్కొన్న బుచ్చి రాంప్ర‌సాద్ ప్ర‌త్య‌క్షంగా అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న‌లో పాల్గొని ఆర్థిక స‌హాయం అందించడం సంతోషంగా ఉంద‌న్నారు.