బుచ్చి రాంప్రసాద్ డేరింగ్... జగన్ పాలన ఆటవికమేనట

June 06, 2020
CTYPE html>
నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న పాలనపై ఎన్నారై టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ సాగిస్తున్న పాలన ఆటవికమైనదేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బుచ్చి రాంప్రసాద్.. ఆటవిక రాజ్యానికి పరాకాష్టగా సాగుతున్న పాలనకు బాధ్యత వహిస్తూ జగన్ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బుచ్చి రాంప్రసాద్ ఓ సంచలన ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జగన్ వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిపోయింది కాబట్టి సరిపోయిందని, అదే ఎన్నికలు జరిగి ఉంటే.. జగన్ అనుచరులు ఇంకెన్ని దుర్మార్గాలకు పాల్పడేవారోనంటూ బుచ్చి రాంప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ మినహా మిగిలిన పార్టీలకు చెందిన ఏ ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకుండా జగన్ తన అనుచరులను ఉసిగగొల్పారని, ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు.... టీడీపీ సహా మిగిలిన విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా దౌర్జన్యాలను గతంలో ఎన్నకూ చూడలేదని కూడా ఆయన మండిపడ్డారు. ఈ తరహా దౌర్జన్యాలకు చోటిచ్చిన జగన్ పాలన... ఆటవిక రాజ్యం కాక మరేమిటని కూడా బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు. 
ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా ఆటవిక పాలన సాగిస్తున్న జగన్ కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని కూడా బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జగన్ సాగిస్తున్న పాలన... ఆటవిక రాజ్యానికి పరాకాష్ట అని చెప్పేందుకు... ఏకంగా 19 మంది పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేయడం కంటే నిదర్శనమేముంటుందని కూడా బుచ్చి మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస తరహా పాలన సాగిస్తున్న జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, తక్షణమే జగన్ తన పదవికి రాజీనామా చేయాలని బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు.