బ‌డ్జెట్-2020 : మస్ట్ నో థింగ్స్ !

March 28, 2020

2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. త‌న రెండో బ‌డ్జెట్‌లో రెండున్నర గంటలకుపైగా ప్ర‌సంగించిన నిర్మల....త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టారు. గ‌త బ‌డ్జెట్ సెష‌న్‌లో 2 గంట‌ల 17 నిమిషాలు మాట్లాడిన నిర్మ‌లా సీతారామ‌న్....ఈ సారి బ‌డ్జెట్‌లో దాదాపు 2 గంట‌ల 40 నిమిషాలు మాట్లాడారు.  దేశ చరిత్రలో తొలిసారిగా రికార్డుస్థాయిలో 160 నిమిషాలకుపైగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది.
అయితే, బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని నిర్మ‌ల ముగించారు.

మూడు అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ బ‌డ్జెట్‌ను రూపొందించారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి అంశాల‌కు తొలి ప్రాధాన్యత‌నివ్వ‌గా...ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు అంశాల‌కు ద్వితీయ ప్రాధాన్యత‌నిచ్చారు. ఇక‌, విద్య, చిన్నారుల సంక్షేమం వంటి అంశాల‌కు తృతీయ ప్రాధాన్య‌త‌నిచ్చారు. అయితే, కొన్ని ప్రధాన రంగాలకు బడ్జెట్‌ 2020 తీరని నిరాశ‌ మిగిల్చింది. ఆటోమొబైల్‌ కంపెనీ పునరుజ్జీవవ‌నం ప్రస్తావన లేదు. టెలికం కంపెనీల గురించి కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవ‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్థిక రంగానికి వెన్నెముక వంటి రియల్‌ ఎస్టేట్ రంగ ప్రస్తావన కూడా బ‌డ్జెట్‌లో లేకపోవడంతో ఆయా రంగాల వారు నిరాశ చెందారు. ఈ విషయంలో తీవ్ర నిరాశ ఎదురు కావడంతో స్టాక్‌మార్కెట్లో ఈ రంగ షేర్లు భారీ నష్టాలను చ‌విచూశాయి.

కేంద్ర బడ్జెట్‌ 2020-21 హైలైట్స్‌


మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు
ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు
0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ. 5-7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
రూ. 7.5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకూ పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు
రూ. 10 నుంచి రూ 12.5 లక్షల వార్షికాదాయంపై 20 శాతం పన్ను
రూ. 12.5 లక్షల నుంచి రూ 15 లక్షల వార్షికాదాయంపై 25 శాతం పన్ను
రూ. 15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను
కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు
కార్పొరేట్‌ ట్యాక్స్‌ 15శాతం తగ్గింపు
డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు
కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు
ఫైనాన్షియల్‌ కాంట్రాక్ట్‌ల ప్రత్యేక చట్టం
మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు
డిపాజిట్‌ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు
పన్ను అధికారుల వేధింపులు అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు
కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
సహకార బ్యాంకుల పరిపుష్టికి చ‌ర్య‌లు
గిఫ్ట్‌ సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌
షేర్ల అమ్మకం ద్వారా ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
2022లో భారత్‌లో జీ 20 సదస్సుకు రూ 100 కోట్లతో సన్నాహాలు


ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి
రాంచీలో ట్రైబల్‌ మ్యూజియం
అహ్మదాబాద్‌లో మ్యారిటైమ్‌ మ్యూజియం
పర్యాటక అభివృద్ధికి తేజాస్‌ రైళ్లు
రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి
ముంబై-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు
పెద్దసంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లు
చిన్న ఎగుమతిదారుల కోసం `నిర్విక్‌` పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ
ఇకపై యంత్రాలతో సెప్టిక్‌ ట్యాంకుల క్లినింగ్‌
ప్రైవేటు రంగంలో డేటా సెంటర్‌ పార్క్‌ల ఏర్పాటు
కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు
ఆప్టికల్‌ ఫైబర్‌ లింక్‌తో లక్ష గ్రామ పంచాయతీల అనుసంధానం

ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
ఆరు లక్షలమంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌పై ప్రత్యేక దృష్టి
మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు
ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రారంభం
విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్‌ పరీక్షలు
ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ
కొత్తగా ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ల్యాండ్‌ బ్యాంక్‌, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌
మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం

వివిధ రంగాల‌కు కేటాయింపులు

జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
విద్యారంగానికి రూ 99.300 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు
టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు
రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌
ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయం
16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్‌ రైలు ఏర్పాటు
సివిల్‌ ఏవియేషన్‌ ద్వారా కూరగాయల సరఫరాకు `కృషి ఉడాన్‌` పథకం
జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫామింగ్‌కు చేయూత
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన
ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం