బడ్జెట్: మధ్యతరగతికి మోడీ గిఫ్ట్

August 06, 2020

మధ్యతరగతి మద్దతుతో అందలం ఎక్కిన మోడీ... చాలాకాాలానికి వారికి భారీ రిలీఫ్ ఇచ్చారు. అనుకున్న దాని కంటే ఎక్కువగానే పన్ను రిలీఫ్ ఇచ్చారు. ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 

ఐదు లక్షల పైన ఆదాయం వచ్చేవారికి కూడా భారీ రిలీఫ్ దక్కింది. రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను విధించనున్నట్లు తెలిపారు.  ఇతర శ్లాబులు ఇలా ఉన్నాయి. 


ఆదాయం    -    పన్ను 

7.5 -10 లక్షల వరకు =  15 శాతం

10-12.5 లక్షల వరకు = 20 శాతం పన్ను

12.5 - 15 లక్షల వరకు = 25 శాతం పన్ను

15 లక్షలు అంతకంటే ఎక్కువ = 30 శాతం పన్ను

కొసమెరుపు - పాత పన్ను విధానం రద్దు చేయలేదు. పాత రేట్లు ప్రకారం పన్నులు చెల్లించాలనుకున్నవారికి ఆ శ్లాబుల ప్రకారం చెల్లించే అవకాశం కూడా ఉంది. అది ఆదాయం ఉన్నవారికి అది ఉపయోగపడొచ్చు.