పది కోట్ల మందిలో ఎవరూ బన్నీ పజిల్ చేదించలేదు

August 07, 2020

అల్లుఅర్జున్... తన కొత్త సినిమా లుక్ తో, టైటిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బాబోయ్... ఇంత మార్పా అని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరికి పేరు అస్సలు నచ్చలేదు. అయితే... చిత్తూరు జిల్లా వాళ్లకి మాత్రం ఆ పేరు బాగా పరిచయం. వాస్తవానికి ఈ సినిమా నేపథ్యం మొత్తం చిత్తూరు చుట్టే తిరుగుతోంది. శేషాచలం అడవుల్లో దొరికే అత్యంత ఖరీదైన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. దీనికి ఒక మాస్ నేమ్ కావాలి. అది కూడా నేటివిటీ ఉండాలి అని ఆలోచించిన సుకుమార్ ... ఆ జిల్లాలో విపరీతంగా పాపులర్ అయిన పుష్పరాజ్ పేరును ఎంచుకున్నారు. ఇది సినిమాలో బన్నీ పేరు. 

ఇక పోతే బన్నీ మనకు ఆరు నెలల క్రితమే ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. కానీ ఒక్కరు కూడా దానిని కనిపెట్టలేకపోయారు. బన్నీ చాలా తెలివిగా పజిల్ లాగ మనకు నేమ్ రివీల్ చేశారు గాని అసలు అదేంటో కూడా ఎవరూ ఆలోచించలేదు. ఇపుడు సినిమా టైటిల్ బయటపెట్టాక...అయ్యో బన్నీ అపుడే చెప్పేశాడు అని అందరూ తమ అజ్జానానికి ఎంబరాస్ ఫీలవుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్. ట్విట్టరులో సింబల్స్ రూపంలో బన్నీ పెట్టిన టైటిల్ ని అస్సలు క్యాచ్ చేయలేకపోయామే అని తీవ్రంగా మదనపడుతున్నారు.

ఇన్ని కోట్ల మందిలో ఎవరూ అల్లు అర్జున్ పెట్టిన ఆ సింబల్స్ గురించి ఎందుకు ఆలోచించలేదబ్బా .. షిట్ అంటున్నారు. భలే పజిల్ పెట్టావు బన్నీ.