‘ఆ పని‘ చేస్తే ఎవడికైనా అక్కడ ఉద్యోగమట

August 13, 2020

దేవాలయాలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోరు కొనసాగిస్తున్నారు. మొన్న టీటీడీ భూముల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి తాజాగా శ్రీశైలంలో జరుగుతున్న స్కాములపై తీవ్రంగా మండిపడ్డారు. ఓం నమ: శివాయ అని పలకలేని నిరక్షకుక్షులను లంచాలను తీసుకుని వచ్చి అక్కడ పెడితే డబ్బులు దోచుకుపోక ఏం చేస్తారు. గుడ్లో లంచం తీసుకుని ఉద్యోగం ఇవ్వగా తప్పు కానిది తాను దోచుకుంటే తప్పా అనుకుంటాడు వాడు. అందుకే దోచుకుపోతాడు. ఏం వ్యవస్థ ఇది? ఇదంతా మారాలి అని బైరెడ్డి అన్నారు.

అక్కడ 300 మంది పర్మనెంట్ ఉద్యోగులుంటే 1300 మంది టెంపరరీ. ఎవడన్నా సీటీ రాసిస్తే ఉద్యోగం. లంచంతో ఉద్యోగం. వాడు దోచుకునే పోతాడు. మీకు బుద్ధుండక్కర్లేదా? 2017లో శ్రీశైలంలో ఆడిట్ జరిగింది. మూడేండ్లు గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి ఆడిట్లు చేయకుండా? దేవుడి సొమ్మును దొంగల పాలు చేస్తున్నాయా?

రాయలసీమలో నీళ్లు లేవు. ఉన్నదల్లా దేవాలయాలే. వాటిని అయినా కాపాడుకోవాలి. మరీ ఇంత అరాచకమా... మొత్తం లెక్కతేలాలి. హుండీ డబ్బు లెక్క తేలాలి. ప్రతిది ప్రతి ఏటా ఆడిట్ జరగాలి అని బైరెడ్డి డిమాండ్ చేశారు.