జగన్... నీకు ప్రసాదం విలువ తెలుసా? ఆడపులి కడిగేసింది

August 11, 2020

video link : https://www.facebook.com/permalink.php?story_fbid=3212598695451685&id=220486867996231

స్వామికి భక్తులు ప్రేమతో, భక్తితో సమర్పించుకున్న భూములను స్వామి వారి కార్యక్రమాలు నిర్వహించడానికి, గుడులు కట్టడానికో, భజన మందిరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కట్టడానికో వాడుకోవాలి. కానీ అమ్ముకుతినకూడదు జగన్... అని బైరెడ్డి కూతురు జగన్ ని కడిగేసింది. నువ్విలా అమ్ముకుతినడానికి భక్తులు విరాళాలు ఇవ్వలేదు. 

హిందు సంప్రదాయాల గురించి తెలియని వారు దేవుడి ఆస్తులను అమ్మకానికి పెట్టారు. రేపు దేవుడ్నే అమ్మకానికి పెట్టరన్న గ్యారంటీ ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఒకాయన వెంకన్నకు ఏడు కొండలు ఎందుకులే అన్నారు, ఇపుడీయన వెంకన్నకు భూములు ఎందుకులే అంటున్నారు.

ఇది తప్పు జగన్... హిందువుల మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. దీనిని సమర్థించేవారు హిందువులే కాదు. మన దేవుడి ఆస్తులు మనం కాపాడుకోలేనపుడు మనం బ్రతికి వేస్టు అన్నారు శబరి. ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? జైలుకు పంపిస్తారా? ఆ జైలు కూడా అమ్ముకున్నుారుగా?!

మీరు చేస్తుంది తప్పు. ఇదే ప్రభుత్వం చర్చిలు, మసీదుల జోలికి వెళ్తారా? వెళ్లగలరా? హిందువులు అయితే ఏమీ అనరు అనా? మీ ధైర్యం.

ఇక ప్రసాదాన్ని బిజినెస్ గా మార్చుకున్నారు. ఎక్కడి పడితే అక్కడ, ఎంత కావాలంటే అంత అమ్ముతారట. ప్రసాదం అనేది దేవుడి దర్శనం అయిన తర్వాత తీసుకునేది. ఎక్కడపడితే అక్కడ అమ్మకానికి పెట్టారు. ప్రసాదం విలువ తెలుసా జగన్ నీకు. దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేసి చెడు కావద్దు జగన్.

ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ తిరుమల. రెండు నెలలు భక్తులు రాకపోతే మీకు డబ్బులు తక్కువ వచ్చాయా? ఇంతకాలం వచ్చిన డబ్బులను ఏం చేశారు? మీకు డబ్బులు లేకపోతే భక్తులకు ఒక్క పిలుపు ఇవ్వండి. ఎంతకావాంటే అంత ఇస్తాం. మా దేవుడి ఆస్తుు మేము కాపాడుకుంటాం అన్నారావిడ.