కేజ్రీని గెలిపిస్తున్న మోడీ

August 09, 2020

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8న జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే... ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకు మాత్రం అపుడే సమాధానం దొరికేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ కి తప్ప ఇంకెవరికీ ఛాన్సే లేదంటున్నారు ఢిల్లీ ప్రజలు. ఇది ఒక సర్వేలో తేలిన నిజం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... మీ ఓటు ఎవరికి అని సర్వేలో రాటుదేలిన సీ ఓటర్ సంస్థ ప్రత్యేక సర్వే నిర్వహించగా... కేజ్రీవాల్ కే ఢిల్లీ జై కొట్టింది. 70 అసెంబ్లీలో 36 వచ్చిన వారే విన్నర్. కానీ కేజ్రీవాల్ కి 50 కి పైగా సీట్లు రావచ్చొని తెలుస్తోంది. అవి 60ని తాకినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

ఢిల్లీలో విద్యావంతుల జనాభా ఎక్కువ. నార్త్ లో సగం నియోజకవర్గాల్లో ముస్లింలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వాస్తవానికి వారు కాంగ్రెస్ ఓటర్లు. కానీ కాంగ్రెస్ కివేస్తే బీజేపీకి ప్లస్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సీఏఏ, ఎన్నార్సీ చట్టాలను మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ కే ఓటు వేయాలని వారు ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఇక సామాన్యులు కేజ్రీ పథకాలకు ఫిదా అయ్యారు. మౌలిక సదుపాయాల్లో కూడా కేజ్రీ ఏం తీసిపోలేదు. జనాల నెత్తిన పథకాలు గుమ్మరించారు. వాటిని ఇంకా ప్రజలు మరిచిపోలేదు. ఏ రకంగా చూసినా కేజ్రీవాల్ బెటరని జనం ఫీలవుతున్నట్టు సర్వేలో తేలింది. 

సాధారణంగా నగరాల్లో నాస్తికులు ఎక్కువ. లౌకికవాదులు కూడా ఎక్కువే. సరిగ్గా ఢిల్లీ ఎన్నికల ముందు సీఏఏని, ఎన్సార్సీని తెరపైకి తెచ్చి బీజేపీ పెద్దలు తాము నివసించే రాష్ట్రంలోనే అధికారం దక్కకుండా చేసుకుంటున్నారు. ఈ చట్టంతో కేజ్రీకి మోడీ తెలియకుండానే హెల్ప్ చేసేశాడు.