సీఏఏ కి మద్దతుగా కాలిఫోర్నియా లో ర్యాలీ

August 06, 2020
CTYPE html>
సీఏఏ కి మద్దతుగా కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని అయిన శాక్రమెంటో అసెంబ్లీ ఎదుట ప్రవాస భారతీయులు  జనవరి  5న 200 మంది మద్దతుదార్లతో ర్యాలీ నిర్వహించారు.  వారు భారత్ మరియూ అమెరికా జాతీయ గీతం, వందేమాతరం ఆలపించారు. సీఏఏను సమర్థిస్తూ ప్లేకార్డులతో ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అందరూ స్వాగతించాలని ర్యాలీకి తరలివచ్చిన కొచ్చిన ప్రవాస భారతీయులు పిలుపు ఇచ్చారు. పొరుగు దేశాలలో ఉన్న మైనారిటీలు అక్కడి జాతి వివక్ష తో  చాలా ఇబ్బందులు పడుతున్నారని, మతపరమైన హింసను ఎదుర్కొని  వలస వచ్చిన వాళ్లకు ఒక చట్టం అన్నది లేకుండా పోయిందని.. వాళ్లందరిని భారత్ లో చట్టబద్దమైన పౌరులుగా ఆహ్వానిద్దామని ర్యాలీకి హాజరైన పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. సీఏఏ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మీడియా ఎలా చూపిస్తుందో, అలాగే సీఏఏ కి మద్దతు తెలుపుతున్నవారిని కూడా మీడియా చూపించాలని ప్రవాస భారతీయులు విజ్ఞప్తి చేసారు.
 
సీఏఏ చుట్టూ అలుముకున్న తప్పుడు సమాచారం, అపోహాలను తొలగిద్దామని ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు నినాదించారు.
 
పాక్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి 2014, డిసెంబర్ 31 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీ, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ముఖ్యోద్దేశం. ఇక ఈ బిల్లు చట్ట రూపం దాల్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  అయితే సీఏఏ వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు కావాలనే నిరసనలు చేపడుతున్నారని ప్రవాస భారతీయులు విచారం వ్యక్తంచేసారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్నవారే అవగాహన లేక నిరసనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కాలిఫోర్నియా రాస్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ కు, పిల్లలను స్కూల్ లో చేర్చడానికి, లేదా ఉన్నవారిని తరువాతి తరగతికి రిజిస్టర్ చేయడానికి (అదే పాఠశాలలో) మూడు భిన్నమైన గుర్తింపు పత్రాలను సమర్పించాలని స్థానిక చట్టలు ఉన్నాయని, వీటిపై ఇక్కడ ఎవరూ నిరసన వ్యక్తం చెయ్యడంలేదని, కానీ భారత్ లో మాత్రం చట్టబద్దమైన పౌరులుగా గుర్తింపు పత్రాలు సమర్పించడానికి నిరసనకారులు  ససేమిరా అంగీకరించడంలేదని వారు విచారం వ్యక్తం చేసారు. భారత్ అంతర్గత భద్రతకు, సమైక్యానికి  సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లు ముఖ్యమని వారు చెప్పారు.  సీఏఏ చుట్టూ ఒక పధకం ప్రకారం ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారాన్ని, అపోహాలను తొలగించాలని  అమెరికా లోని వివిధ నగరాలలో  ప్రవాస భారతీయులు అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తున్నారు అని వారు గుర్తుచేసారు.
 
సీఏఏ చట్టాలతో తమను భారత్ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు అనవసర అభద్రత భావానికి లోనవుతున్నారని వారు తెలిపారు. చట్టబద్దమైన పౌరులుగా ఉండి, గుర్తింపు పత్రాలు ఉన్నవారిని ఎవరు తొలగిస్థారు అని వారు ప్రశ్నించారు.  కనుక వారి అపోహాలను తొలగించేందుకు తాము ఈ ర్యాలీని నిర్వహించామని పేర్కొన్నారు.  
 
సీఏఏ ని వ్యతిరేకిస్తున్న వారు ఫేస్ బుక్, వాట్స్ ఆప్ లలో  ప్రజలకు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారని, వీటి వెనుక ఉన్న అసలు వాస్తవాలను వినడానికి గానీ, మాట్లాడాటానికి గానీ వారు ఏమాత్రం అంగీకరించడం లేదని, ఈ విషయంలో వారి దృక్పథం మారాలని ప్రవాస భారతీయులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఈ మార్పులకు తాము పూర్తి మద్ధతు ఇస్తున్నామని ర్యాలీలో పాల్గొన్న వారు చెప్పారు.
 
నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఆందోళనల పేరుతో ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని, హింసకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని ఈ ర్యాలీలలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం పొరుగుదేశాలలో మతహింస, వివక్ష బారిన పడ్డవారికి  ఎంతో ఊరటని ఇస్తుంది అని  ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజలలో అవగాహన ఏర్పరచడానికి " శాక్రమెంటో ఫర్ న్యూ ఇండియా" సంస్థను ఏర్పాటుచేసామని ప్రవాస భారతీయులు ప్రకటించారు.    

RELATED ARTICLES

  • No related artciles found