ముఖ్యమంత్రి సూపర్ ఐడియా... ధర్నా చేసిన వారికి చలిజ్వరమే !

August 03, 2020
CTYPE html>
క్యాబ్ బిల్లుపై అపోహలు దేశంలో విధ్వంసానికి దారితీస్తున్నాయి. దేశంలో అయోధ్య తీర్పు అనంతరం తీవ్ర అసంతృప్తితో ఉన్న ముస్లింలను క్యాబ్ బిల్లుపై అర్ధసత్యాలు ప్రచారం చేసి రెచ్చగొట్టడంతో దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, యూపీ, గుజరాత్ వంటి చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ రాజధానిలో కూడా హింస చెలరేగింది. పలుచోట్ల ఇంటర్నెట్ ఆపేశారు. ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి అయిన యూపీ సీఎం యోగి నిరసనకారులను నిలువరించడానికి కొత్త ఐడియా వేశారు.
’’ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. రాష్ట్రంలో నెలరోజులుగా నిరసనలకు అనుమతి లేదు. ప్రత్యేక అనుమతి తీసుకున్న వారికే నిరసన తెలిపే అవకాశం ఉంది. కొందరు రోడ్లపైకి వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వీడియోలన్నీ మా వద్ద ఉన్నాయి. అన్నీ నోట్ చేశాం. హింసకు పాల్పడిన వారి ఆస్తులు వేలం వేసి మరీ ప్రభుత్వ ఆస్తి నష్టాన్ని పూడుస్తాం’’ అంటూ యూపీ సీఎం యోగి వార్నింగ్ ఇచ్చారు. యోగి హెచ్చరికను ఆందోళనకారులు  వింటారో లేదో తెలియదు కాని తాను అనుకున్నది మాత్రం యోగి చేసి తీరుతారు. కొద్ది రోజులు వేచిచూస్తే విషయం అర్థమవుతుంది.