చౌదరి గారు కట్టారు... రెడ్డి గారు చెప్పుకుంటున్నారు

August 13, 2020

పబ్లిసిటీ చేసుకోవాలంటే జగన్ కి మించిన వారే లేరు.

జగన్ పీఆర్ టీఎం చంద్రబాబు కంటే వంద రెట్లు బలమైనదని చెబుతుంటారు.

చంద్రబాబు హయాంలో 2 వేల అంబులెన్సులు ప్రారంభించినా బాబుకు రాని క్రెడిట్ అందులో ఈరోజు అందులో సగం అంటే 1100 వందల ప్రారంభించిన జగన్... దేశంలోనే ఎవరూ చేయని పని చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

అలా ప్లాన్ చేస్తారు వాళ్లు. చిత్రమేంటంటే... ఇందులో సగం అంబులెన్సులు పాత వాటికి రంగులేశారు. కొత్తవి కొన్నే. 

ఇది పక్కన పెడితే డాక్టర్స్ డే రోజున జరిగిన మరో కీలక పరిణామం నాట్కో సంస్థ నిర్మించిన కేన్సర్ ఆసుపత్రి ప్రారంభం.

ఇది ప్రత్యేక ఆస్పత్రి కాదు, గుంటూరు జీజీహెచ్ లో భాగమే.

జగన్ వచ్చాక జగన్ ఆరోగ్యానికి ఎంత మంచి పని చేశాడు అని అనిపిస్తుంది ఈ వార్త చదివిన వారికి. కానీ మీరు నాట్కో ఆస్పత్రి నేపథ్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

రాష్ట్రం విడిపోయాక ఏపీకి ఒక్క కేన్సర్ ఆస్పత్రి కూడా లేకుండా పోయింది.

దీంతో 2016లో నాట్కో ఫార్మా అనే సంస్థ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు వచ్చింది.

తమ నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో ఆస్పత్రి కడతామని, స్థలం మంజూరు చేయాలని నాట్కో ఫార్మా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది.

మంచి పని చేస్తే కాదంటామా ... మీకు గుంటూరు ఆస్పత్రికి అనుబంధంగా స్థలం కేటాయిస్తాం. అక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటుంది అని చంద్రబాబు హామీఇచ్చారు. 

నాట్కో ఫార్మా అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి...15 కోట్లు కేటాయించి కేన్సర్ ఆస్పత్రికి భవంతి నిర్మిస్తామని చెప్పారు.

అయితే, ఆ తర్వాత మనసు మార్చుకుని 33 కోట్లు ఖర్చు పెట్టి 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నాలుగంతస్తుల భవంతిని నిర్మించారు.

ఇందులో 110 పడకల సామర్థ్యంతో కీమో థెరపీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్లు, ఐపీ వార్డులు నిర్మించారు.

సకల హంగులతో ఆస్పత్రి సిద్ధమైంది.

అంతేకాదు, జీజీహెచ్లో ఇతర విభాగాలకు మరో 10 కోట్లతో అంతకుముందే ఆయన అభివృద్ధి పనులు చేయించారు.

2016లో మొదలుపెట్టిన ఈ పని 2019లోపు అవ్వాల్సింది.

అయితే, చంద్రబాబు ఉన్నంత వేగంగా ఆయన వద్ద అధికారులు ఫాస్టుగా ఉండరు. పైగా చంద్రబాబుకు ఏది ప్రజలకు నేరుగా కనిపిస్తుందో దానిపై దృష్టిపెట్టడంలో ఎపుడూ లేటే.

అధికారుల ఆలస్యం వల్ల నిర్మాణం లేటయ్యింది.

2019 చివరికి పూర్తయినా కొన్ని కారణాల వల్ల దానిని ప్రారంభించలేదు. 

ఇపుడు అధికారంలో ఉన్న జగన్ దీనిని తన ఖాతాలో వేసుకున్నారు.

దీనిని ప్రారంభించిన సందర్భంగా జగన్ అన్న మాట వింటే మీకు జగన్ ఎలా పీఆర్ చేసుకుంటారో అర్థమవుతుంది.  

వైయ‌స్ జ‌గ‌న్‌ క్యాంప్ కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్  ద్వారా దీనిని ప్రారంభించిన జగన్ రెడ్డి ప్ర‌జారోగ్యానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌న్నారు.

మరి పెద్దపీట వేసింది చంద్రబాబా? జగనా? పైగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆస్పత్రి కట్టించింది చాలక ముఖ్యమంత్రి గారి పేపర్లో యాడ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

గవర్నమెంటు తరఫున ఆ ప్రకటన ఇవ్వచ్చు కదా.  అదెలా కుదురుతుంది అంటారేమో.

ఎందుకంటే పాపం కట్టించింది చౌదరి గారు కదా. ఇలా ఉంటుంది జగన్ రెడ్డి గారి వ్యవహారం.