3 capitals : హైకోర్టులో జగన్ కి భారీ షాక్

August 08, 2020

3 రాజధానులు పెట్టినా పెట్టకపోయినా విశాఖపట్నానికి అదే భోగాపురానికి రాజధానిని తరలించాల్సిందే అని పట్టుదలగా ఉన్న జగన్ కి భారీ షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

రాజధాని ఎక్కడ ఉండాలనేది  కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం అని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడంతో ద్వారా జగన్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది హైకోర్టు. అనంతరం విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు నిర్మాణాలను పూర్తి చేయాలని దాఖలైన పిటీషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చింది. దానిపై హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ప్రభుత్వం తన వ్యాజ్యాల్లో గెలిస్తే హైకోర్టును కూడా తరలించాలి కదా? మరి నిర్మాణాలు ఎలా అని పిటీషనర్ ను హైకోర్టు  ప్రశ్నించింది.