కరోనా విళయ తాండవం!!

August 09, 2020

కరోనా చేసిన విళయ తాండవానికి చాలా దేశాలు విలవిల్లాడాయి. మొదట వహించిన నిర్లక్ష్యమే వాటి పాలిట శాపంగా మారింది. అమెరికాలలో కేసుల సంఖ్య మొదట తక్కువగా ఉన్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిపట్ల నిర్లక్ష్యం వహించారు.

వైరస్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసిన ఆయన మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఇది చైనా ప్లేగు వ్యాధి అని సంభోదించారు. నేను కూడా మాస్కు పెట్టుకోనని అన్నారు. ఈ నిర్లక్ష్యమే అమెరికా కొంపముంచి, ట్రంపునకు చెడ్డపేరు తెచ్చిపెట్టింది.

వైరస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు అమెరికాలో వైద్యశాలలకు కొదవలేదు. కానీ అక్కడ వైరస్ వచ్చిన కేంద్ర బిందువు ప్రాంతాల్లో వైరస్ సోకిన రోగులకు సరైన వసతులు, డాక్టర్లకు సదుపాయాల కలప్పనలో విఫలమయ్యారు.

ప్రత్యేక దృష్టి చూపకపోవడంతో తగినంత సదుపాయం లేక ఉన్నవాటితోనే సర్దుకోవాల్సిన పరిస్థతి. వెంటిలేటర్ల కొరత కూడా తీవ్రంగా వెంటాడింది. సామాజిక దూరం పాటించడంలో వైఫల్యం చెందింది. కాలేజీ విద్యార్ధులు ఫ్లోరిడా సముద్ర తీరంలో విచ్చల విడిగా తిరిగారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి లూసియానాలో ఓచర్చి పాస్టర్ వేలాది మందికి ఆహ్వానం పలికారు. ఈయన ఓ చానల్లో మాట్లాడుతూ ఈ వైరస్ రాజకీయ పార్టీల సృష్టేనని మేం నమ్ముతున్నామ. మా మత పరమైన హక్కుల్ని మేం కాపాడుకుంటాం ఎవరేమనుకున్నా అందరినీ కలవబోతున్నామని చెప్పారు.

ఇలాంటి దుష్టాంతాలు చూస్తేనే జనం ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థం చేసుకోవచ్చు. వైరస్ ను కట్టడిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. న్యూయార్క్ లో సబ్ వేలు మూసేయడం వల్ల బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి.

యూనివర్సిటీ విద్యార్థులను ఒకేసారి ఇంటికి పంపడం వల్ల కూడా వైరస్ ఒక చోట నుండి మరొక చోటుకు విస్తరించేందుకు కారణం అయింది. స్పెయిన్ లో ఒకే యువతి ద్వారా సుమారు 50 వేల మందికి సంక్రమించిందని సమాచారం.

కరోనా సోకిన యువతి పబ్బుకు వెళ్లడం, అక్కడ అందరితో కలివిడిగా తిరగడంతో వైరస్ వ్యాప్తి చెందింది. నియంత్రణ చర్యల్లో ఈ దేశం నిర్లక్ష్యం వహించింది. దీంతో దేశంలో పెద్ద మొత్తంలో కేసుల బయటకు వచ్చాయి.

తదనంతరం తీసుకున్న చర్యలతో 113 ఏళ్ల వృద్ధురాలను కూడా కపాడగలిగే స్థితికి వచ్చారు. జర్మనీలోనూ వైరస్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో త్వరితగతిన ఆ ప్రభావాన్ని అంచనావేసి రివర్స్ క్వారంటైన్ వ్యూహాన్ని అమలు చేసింది.

అంటే వైరస్ బారిన పడితే దాని తీవ్రత ఎక్కువగా ఉంగే వృద్ధులు, గర్భిణీలను వైరస్ సోకకముందే విడిగా ఉంచి వైద్య సదుపాయం అందించింది. ఫలితంగా కరోనా వ్యాప్తి చెందలేదు. ఈ వ్యూహానికి ముందు రోజుకు సగటున 7 వేలు ఉండేవి, కానీ తర్వాత 227 తగ్గాయి.

అతిచిన్న దేశమైన సింగఫూర్ లో కూడా వలస వచ్చిన కార్మికులు, నల్ల జాతీయులు, ఇతర సమూహాలపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్సను అందించింది. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. రోజుకు సగటున 1,426 ఉండేవి కానీ తర్వాత 123 తగ్గాయి.

దక్షిణ కొరియా 2015లో మెర్స్ వ్యాధి ప్రబలి సిబ్బంది వైరస్ వాహకా ుగా మారార బాధితులకు సేవలుచేసే క్రమంలో వ్యాధి బారిన పడిన వైద్యులను గుర్తించి వారిని విడిగా ఉంచింది. అధికారికంగా లాక్ డౌన్ చేయకుండానే వైరస్ ను విజయవంతంగా ఎదుర్కొంది.

కొన్ని వేల మందిని రహదారులపైనే ఆపేసి మొబైల్ ఫోన్, శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షలు నిర్వహించింది. వైరస్ పుట్టినిల్లు అయిన చైనా కూడా వైరస్ ను అంతం చేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసింది.

వైద్యులు, నోడల్ ప్రభుత్వాధికారులు, రెండు దశల్లో వైరస్ బాధితులను గుర్తించి చికిత్స అందించారు. దీనిని పరిశీలించడానికి ప్రేవేటు ఏజెన్సీలతో చైనా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పై దేశాలు పడుతున్న పాట్లు మన దేశం చూసినప్పటికీ మొదట వహించిన జాగ్రత్తలు కేసులు పెరుగుతున్న సమయంలో తీసుకోలేదు.

ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా దాన్ని కొందరు పాటించినట్లు నటించారు. వైరస్ మాత్రం తన పనితాను చేసుకుంటూ పోయింది. పరిస్థతి చేజారి పోతున్నా వైరస్ నియంత్రణపై శ్రద్ధ తప్పించారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో మొదట కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ మోతాదులో ఉంది.

దీంతో వైరస్ ను ప్రభుత్వం ఎదుర్కొందనుకున్న నేపథ్యంలో నాయకులు తెలిసే చేసిన తప్పిదాలతో వైరస్ కు ఊతం ఇచ్చారు. రాజు తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాజ్యం బాగోగులుంటాయి. కానీ ఆ రాజు నిర్ణయాలు, చేసే పనులు లోకానికి విరుద్ధంగా ఉంటే రాజ్యం తగిన మూల్యం చెల్లించుకుంటుంది.

ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలు అనుసరించేదానిలా ఉండాలి ప్రజలకు సూచన కావాలి.. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్పేది..చేసేది అందుకు పూర్తి విరుద్ధం. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది పనికిమాలిన పనులు అన్న చందంగా మన సీఎం నిర్ణయాలు, పనులున్నాయి.

రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తోంది మొర్రో అంటే సరిహద్దు దొర ఏదో పారాసిట్ మాల్, బ్లీచింగ్ పౌడర్ వేస్తే తగ్గిపోతుందన్నాడని ఈయన కూడా ఆ రాగమే ఎత్తుకున్నారు. ఇంకేముంది..మద్యం షాపులు తెరిచారు, లాక్ డౌన్ నిబంధనలు తొక్కి పెట్టారు.

జిల్లాలే కాకుండా రాష్ట్రాల హద్దులు దాటారు. అడ్డొచ్చిన వారిని, చెప్పిన వారిపై ప్రతాపాన్ని చూపించారు. చివరకు చేసిందేమిటి చేతులెత్తేయడం తప్ప. అదే సూత్రాన్ని గ్రామ గ్రామాన, వాడవాడనా వైసీపీ నాయకులు తూచా తప్పకుండా అనుసరించారు.

కరోనా లక్ష్యాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు నెరవేర్చారు. ముఖ్యమంత్రి ఆలోచనా ప్రకారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా వ్యాప్తి పెంపొందించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దీనిలో భాగంగానే నేడు వాళ్లు కూడా ఇబ్బుందలు పడే పరిస్థతి వచ్చింది.

ఎమ్మెల్యేలు ముస్తఫా, అన్నా బత్తిన శివకుమార్, కిలారు రోశయ్య, అంబటి రాంబాబు , కాసు మహేష్ రెడ్డి, హఫీజ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అంజాద్ భాషాలకు కరోనా పాటిజివ్ వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇష్టమైన కార్యక్రమాలకు వ్యక్తిగతంగా వెళ్తారు.

జూలై 8న తన తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొనడాకి ఆగమేఘాల మీద ఇడుపులపాయ వెళ్లారు. తండ్రి సమాధిని సందర్శించవద్దని మేము అనండంలేదు. కానీ ఆయన కరోనా నిబంధనలు పాటించాలనే గుర్తు చేస్తున్నాం.

అదే జూలై 8న ఆయనకు ఇష్టం లేని కార్యక్రమం కావడంతో కూత వేటు దూరంలో ఉన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని శంకుస్థాపన చేశారు. దళితుల ఓట్లు అడిగేటప్పుడు ఊరూరు తిరిగారుగా? ఇంట్లో కూర్చుని ఓట్లెందకు అడగలేదు.

జూలై 1న తనతో పాటు 16 నెలలు జైళ్లో ఉండి వచ్చిన విజయసాయిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 104, 108 వాహనాలను ప్రారంభించడానికి కూడా విజయవాడ వెళ్లారు కదా. విజయసాయిరెడ్డికి ఇచ్చిన విలువను అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వరు.?

అయినా ఆ కార్యక్రమంలో కూడా కరోనా నిబంధనలు ఏమయ్యాయి? మాస్కులు ఎందుకు ధరించలేదు.? వ్యక్తిగత దూరం ఎందుకు పాటించలేదు? రాష్ట్ర ప్రజానీకానికి, సహచరులకు ఒక దశ, దిశ చూపించి ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కరోనా నిబంధనలు ఆచరించడంలేదు.

యథారాజా తధాప్రజా అన్నట్లు తయారయ్యారు ఆ పార్టీ నాయకులు. కరోనా విస్తరణకు వీరోచితంగా పోరాడిన జగన్ రెడ్డి పార్టీ నాయకులు చాలా మందే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో లాక్ డౌన్ సమయంలో మధుసూధన్ రెడ్డి జనానికి పంచిన బియ్యం కంటే ఆయన ద్వారా కరోనా బారిన పడిన బాధితులే ఎక్కువగా ఉండటం.

ఈయన బియ్యం పంచుతూ ఊరేగింపులు చేసిన సంబరాలు జాతీయ మీడియాలో కూడా రావడం తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడా చేపట్టని అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జనాన్ని పోగేసుకుని, పూలు చల్లించుకుంటూ బోరింగు ప్రారంభ కార్యక్రమాన్ని రోజారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు.

దీని వల్ల ఆమె పీఏకు, గన్ మెన్ కు కరోనా సోకడమే కాకుండా, పక్క వారికి కూడా వ్యాప్తి చెందడానికి వీళ్లు దోహదపడ్డారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ వైసీపీ నేతలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను నమ్మలేమని ప్రత్యక్షంగా చెప్పారు.

అధికారంలోకి వచ్చాక వీళ్లకు వ్యాధి సోకితే ఏపీలోని ఆసుపత్రుల్లో ఉన్న పరికరాల మీద, డాక్టర్ల మీద మాకు నమ్మకం లేదు అని ప్రత్యక్షంగా నిరూపించారు. నిబంధనలు వీళ్లు పాటించరు పాటిచేందుకు ప్రజలు మాస్కులు అడిగితే ఇష్టాను సారంగా కొడతారు.

మాస్కు పెట్టుకోకపోతే చంపుతారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి తోడైన ఆనాలోచిత కారణాలే రాష్ట్రాన్ని కరోనాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఏపీలో బ్రహ్మాండంగా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రులుగానీ, ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఇక్కడ వైద్య సేవలు చేయించుకోరు.

పదవుల్లో ఉన్నారు కాబట్టి వీళ్లకు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. మరి మన రాష్ట్రంలో ఉన్న అపోలో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఆసుత్రులపై విధించే జీఎస్టీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో మరో పదిమందికి ఐదేళ్ల పాటు అమ్మఒడిని బ్రహ్మాండంగా అందించవచ్చు.

మన రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బతీసి వాళ్లకు అవసరమైన రీతిలో పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెడతారు. విచ్చల విడిగా ప్రజాధనంతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రమంతా చక్కర్లు కొట్టి ప్రజల్ని కరోనా బారిన పడేశారు

. జీరో కేసుల్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను నేడు కరోనా ఉపద్రవంలోకి ఈ వైసీపీ నాయకులు తీసుకువెళ్లారు. ఐదు పది కేసులతో ఉన్న విశాఖ నగరాన్ని విజయసాయిరెడ్డి గాలి పర్యటనలతో కరోనా రోగులతో ముంచెత్తారు.

ప్రారంభ కార్యక్రమంలో మాస్కు లేకుండా గంటల తరబడి ప్రసంగాలు చేయాల్సిన సమయమా ఇది.? గాజువాకలో జనసందోహంలో మార్కెట్ కమిటీలను ప్రారంభించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన కరోనాతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కొరత లేని వైద్య సదుపాయాలతో చికిత్స చేయించుకుంటున్నారు.

మరి ఆ సభలో పాల్గొన్న గాజువాక ప్రజల సంగతేంటి? ఊరూవాడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలకు మేం వ్యతిరేకం కాదు ఈ విపత్తుల సమయంలో ఉత్సవాలు చేయాల్సిన అవసంర ఏమిటి.? ప్రధాన మంత్రి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ బయటకు రాకుండా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు కదా.

సైనికులకు భరోసా ఇవ్వడానికి మాత్రమే ఆయన వుహాన్ పర్యటనకు బయటకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండి జూమ్ యాప్ ద్వారా పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే దాన్ని వైసీపీ నేతలు విమర్శిస్తారు.

టీడీపీ నాయకులు మీలాగా లెక్కలేని తనంతో బయట తిరిగి కరోనా వ్యాప్తికి కృషి చేయాలని విమర్శిస్తున్నారా? ఇకనైనా చెడు తిరుగుళ్లు ఆపి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి పాటుపడండి.

Read Also

’’జగన్ మాట విన్నారు... బుక్కైపోయారు !!‘‘
విజయవాడ టాప్ అంటే ఎందులోనో అనుకున్నా.. అబ్బా..!!
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అఫ్ డాలస్ (టీపాడ్)  ఆధ్వర్యంలో మాస్కులు మరియు శానిటైజెర్ల పంపిణీ.