​బిగ్ బాస్ 3 పై కేసు నమోదు !

August 03, 2020

​తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో బాగానే హిట్టయ్యింది. అదేంటో సడెన్ గా లైంగిక వేధింపుల వ్యవహారం ఇందులోనూ ఎంటరైంది, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ పై ఆరోపణలు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం శ్వేతారెడ్డి దీని గురించి తొలుత గొంతువిప్పారు. మా బాస్ ని ఎలా సంతృప్తి పరుస్తావు అని తనను అడిగినట్లు ఆమె ఆరోపించారు. తాజాగా ఆమె బంజారాహిల్స్ స్టేషనులో కేసు కూడా పెట్టారు.
‘సెలక్షన్స్ కోసం వచ్చిన వారిని కమిట్‌మెంట్ ఇస్తారా?, బాస్‌ని ఎప్పుడు సంతృప్తి పరుస్తారు? మీరు బాడీ ఎప్పుడు తగ్గించుకుంటారు. వర్కవుట్స్ ఎప్పుటి నుంచి మొదలు పెడతారు? అని అడిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ బాస్ అనేది గేమ్ షో. దానికి నా షేపులకు ఏం సంబంధం అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా
బిగ్ బాస్ రియాలిటీ షోలో వారి పిలుపు మేరకు వెళ్లాను. ఎంపిక సమయంలోనే ఆ షో నిర్వాహకుల నుంచి నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని ఆమె ఆరోపించారు. నిర్వాహకులు తనను 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావని అడిగారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 జులై 21 నుంచి ప్రారంభం కానుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించి షోను పాపులర్ చేశారు. మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తయింది.