వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు...

February 22, 2020

ఇపుడు ఏపీలో వైసీపీ మీడియం అని కొత్తగా ఒకటి ట్రెండ్ అవుతోంది. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియంతో పాటు వైసీపీ మీడియం అనేది కూడా ట్రెండ్ అవుతోంది. ఇదేంటి... అనుకుంటన్నారా? వైసీపీ మీడియంలో ఫాదర్ ని నీ అమ్మ మొగుడు అనాలట. అయితే, దీనిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రాయడానికి చాలా కష్టమైన బూతులు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే మాటలు విని పక్కనే ఉన్న వైసీపీ ఎంపీయే షాక్ కి గురయ్యారు. చివరకు చేసేదేం లేక రామరామ అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉండిపోయారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును బూతులు తిట్టిన ఎమ్మెల్యే ఆయన పరువునకు భంగం కలిగించారంటూ... ఓ వ్యక్తి కాకినాడ పోలీసు స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. కాకినాడలో జరిగిన 3 రాజధానుల మద్దతు ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి...  చంద్రబాబు పరువుకు భంగం కలిగించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పెట్టిన వ్యక్తి పేరు గుమ్మళ్ల వెంకటేశ్వరరావు. అయితే... ఇదే ర్యాలీలో పవన్ ను కూడా ద్వారంపూడి తీవ్రంగా తిట్టారు.