వైసీపీ నేత పీవీపీ దౌర్జన్యం - కేసు నమోదు 

August 03, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్ (PVP)పై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్టు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఆయన పక్క ఇంటి యజమాని అయిన కైలాష్ ...  పీవీపీపై కేసు పెట్టారు. దీంతో పీవీపీ ఒక రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు. ఇరు వర్గాలను బంజారాహిల్స్ పోలీసులు పిలిపించి విచారణ జరుపుతున్నారు.

పీవీపీ ఇంటి పక్కన ఓ వ్యక్తి ఇల్లుంది. అతని ఇంటిపై రూఫ్ టాప్ గార్డెన్ కడుతున్నారు. దానిని కొందరు కూల్చేశారు. వాళ్లందరూ పీవీపీ మనుషులే అని నా ఇంటి మీద నేను కట్టుకుంటే వాళ్లు వచ్చి కూల్చేశారు అని యజమాని కైలాష్ కేసు పెట్టారు.

‘‘రెండేళ్ల క్రితం నేను ఇల్లు కొనుక్కున్నాను. రిజిస్ట్రేషన్ మాత్రం ఇటీవలే చేయించుకున్నాను. నా ఇంటి మీద, నా డబ్బుతో రూఫ్ టాప్ గార్డెన్ కడదాం అని ప్లాన్ చేస్తే గతంలో పీవీపీ బెదిరించారు. నా ఇంటి మీద ఏం కట్టాలనేది నా ఇష్టం. ఇటీవలే రూఫ్ టాప్ గార్డెన్ కడుతుంటే ఇంటికొచ్చి పనులు ఆపమని పీవీపీయే వార్నింగ్ ఇచ్చారు. కడితే కూల్చేస్తానని అన్నారు. నా ఇల్లు నా ఇష్టం అని నేను కడుతుంటే...  బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. మా ఇంటిపై గార్డెన్ కడితే ఆయన ఇల్లు సరిగా కనిపించదని, అందుకే కట్టొద్దంటన్నారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లొచ్చి, కూల్చివేతను ఆపించారు‘‘ అని బాధితుడు కైలాష్ మీడియా ముందు వెల్లడించారు.

భారీ చిత్రాల నిర్మాత అయిన పీవీపీ గత ఎన్నికల్లో విజయవాడలో పోటీ చేసి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం 7 కోట్లు బండ్ల గణేష్ తనకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించిన కేసు మనకు తెలిసిందే. ఇపుడు ఆయన మీద ఇంకొకరు కేసులు పెట్టారు.