కొల్లు రవీంద్ర పై కన్నేశారు

August 07, 2020

తెలుగుదేశం నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోంది. పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకేసులో పోలీసులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర పై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్రను త్వరలో పోలీసులు విచారించనున్నట్టు సమాచారం అందుతోంది. 

ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను పోలీసులు విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా కొల్లు రవీంద్రపై కేసులు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా చేపల మార్కెట్లో ఉన్న భాస్కరరావు హత్య రెండ్రోజసుల క్రితం తీవ్ర సంచలనం సృష్టించింది. పేర్ని నానితో ఎంతో కాలంగా భాస్కరరావు ఉన్నారు. కొల్లు రవీంద్ర తన అనుచురుడు చింతా చిన్నితో ఈ హత్య చేయించారి మోకా భాస్కరరావు కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.


వీరిద్దరికి (రవీంద్రకు-భాస్కరరావుకు) గుమ్మటాల చెరువు విషయంలో  వివాదం ఉందని మోకా  అన్న కుమారుడు మోకా రాజేశ్ ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.