ఈ ఐడియా సూపర్... దేశమంతటా వాడండి ఆఫీసర్ !

August 10, 2020

లాక్ డౌన్ 

కంటైన్మెంట్ 

భౌతిక దూరం

మాస్కు... 

అన్ని ఐడియాలు అయిపోయాయి. కానీ కరోనా పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. దేశంలో కొన్ని జిల్లాల్లో ఇది తీవ్రంగా ఉంది. ఎలా పెరుగుతుందో అర్థం కావడం లేదు. ఏం చేసినా తగ్గడం లేదు. నగరాలు తీసేస్తే కర్నూలు, గుంటూరు, కృష్ణా, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని (Ujjain) ఇలా కొన్ని జిల్లాల్లో కరోనా బాగా పెరుగుతోంది. అయితే... దీనిని ఎలా కట్టడి చేయాలా? అని తలమునకలైన ఉజ్జయిని అధికారులు ఒక ఐడియా వేశారు. 

ఆ జిల్లాకు వచ్చిన కేసుల్లో అత్యధిక కేసులు బయట నుంచి వచ్చిన వారు అంటించినవే. దీంతో ఉజ్జయిని అధికారులు ఏం చేశారంటే... ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక నుంచి కొత్త వారు మన జిల్లాకు వచ్చిన విషయం తెలిసి ఆ సమాచారం మాకు ఇస్తే... ఒక్కో సమాచారానికి రూ.500 క్యాష్ బహుమతి ఇస్తామన్నారు. అంతేకాదు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా బయటకు చెప్పమని హామీ ఇచ్చారు.

ఇది బానే ఉంది గాని... ఈ ఐడియాను ఇంకొంచెం పాలిష్ చేసి ఇండియా అంతటికీ విస్తరించాలి. ఎక్కడైనా ఎవరైనా పార్టీలు నిర్వహిస్తే, గుంపులు గుంపులుగా కార్యక్రమాలు నిర్వహిస్తే సమాచారం ఇచ్చిన వారికి ప్రైజు మనీ ప్రకటించాలి. అది ఆన్ లైన్లోనే రహస్య బదిలీ చేయాలి. లాక్ డౌన్ ఉల్లంఘనలు దేనికి పాల్పడినా సమాచారం ఇవ్వండి, ప్రైజు మనీ గెలవండి... అని దేశమంతటా ఈ ఐడియాను కనుక అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం కచ్చితంగా ఉంది.