సోషల్ మీడియాలో కులం లెక్కలు ఇవిగో..

August 08, 2020

దేశంలో కులం, మతం మనుషుల మెదళ్లలో తిష్ఠ వేసుకుని ఉన్న నేపథ్యంలో అన్నింటా కులాన్ని వెతుకుతున్నారు. చివరకు దేశానికి ఎవరైనా ఒక పతకం సాధించినా, అవార్డు సాధించినా.. లేదంటే దేశంలో ఎవరైనా ప్రముఖుడు మరణించినా వారి పేరు మీడియాలో కనిపించగానే గూగుల్‌లో ఆ వ్యక్తి కులమేంటో వెతకడం మొదలుపెట్టేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి రంగంలోనూ తమ కులం వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. కులాలకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడేవారు కూడా పలానా యూనివర్సిటీలో ప్రొఫెసర్లలో ఫలానా కులం వారు లేరని.. అందరూ ఇంకో కులం వారే ఉన్నారని.. హాస్పిటల్‌లో డాకర్టలో ఎక్కువ మంది ఒకే కులం వారని.. ఇలా.. ప్రతి చోటా కులం కంటితోనే చూడడం ఎక్కువైంది. తాజాగా సోషల్ మీడియాలోనూ కులాలా డామినేషన్ల గురించి తాజాగా లెక్కలు బటయకొచ్చాయి.
సోషల్ మీడియాలో ఏఏ వర్గాలు ఎలా స్పందిస్తున్నాయన్న దానిపై దిల్లీకి చెందిన లోక్‌నీతి అండ్ సెంటర్‌ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్‌ సొసైటీస్( సీఎస్‌డీఎస్‌) అనే సంస్థ జర్మనీకి చెందిన మరో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. సోషల్ మీడియా అండ్ పొలిటికల్ బిహేవియర్ పేరుతో రిపోర్టును విడుదల చేసింది.
ఈ రిపోర్టు ప్రకారం దేశంలో అగ్రవర్ణాల వారే ఎక్కువగా  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 15 శాతం మంది అగ్రవర్ణాల వారు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా దళితుల్లో 8శాతం, గిరిజనుల్లో ఏడు శాతం మంది ఉన్నారు. బీసీల్లో 9 శాతం మంది సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారట.