మోడీకి షాకిచ్చిన ఎలక్షన్ కమీషన్! ఇలా దొరికిపోయాడా?

July 08, 2020

ఎలక్షన్ కోడ్ అమ్మల్లో ఉన్నపుడు ఎలక్షన్ కమీషన్ కే సర్వాధికారాలు ఉంటాయి. కమీషన్ నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంగిస్తే వారిపై వెంటనే చర్య తీసుకునే అధికారం ఎలక్షన్ కమీషన్ కి ఉంటుంది. ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం బాస్ కిందే లెక్క. ఇటు రాష్ట్రాల్లో అయినా అటు కేంద్రంలో అయినా ఎలక్షన్ కమిషన్ చెప్పిందే వేదంగా జరిగి తీరాల్సిందే. మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఎన్నికల సంఘానికి మొత్తం వ్యవస్థను అదుపు చేసే అధికారం తప్పనిసరి ఉండాల్సిందే రాజ్యాంగం ఎప్పుడో తేల్చి చెప్పింది.

వెరసి దేశంలో ఎన్నికలకు రంగం సిద్ధమైందంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పటిదాకా చక్రం తిప్పిన ప్రభుత్వాలు కోడ్ అమల్లోకి రాగానే కోరలు పీకిన పాముల్లా మారక తప్పదు. ఈసీ నియమాలను కాదని ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవ్వరికీ ఎలాంటి అధికారాలు ఉండవు. ఇలాంటి పరిస్థితికి అద్దం పట్టే ఆసక్తికర ఘటన ఇప్పుడు చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో కేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఓ పని చేసి మోడీ అడ్డంగా బుక్కైపోయారు.

తీరా ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ... నమో టీవీ ఛానెల్ ను ఎలా ప్రారంభిస్తారంటూ నేరుగా ప్రధానినే ప్రశ్నించేసింది ఎన్నికల సంఘం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా ఈసీ నోటీసులు జారీ చేసేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని కూడా విస్మరిస్తారా? అంటూ మోదీ సర్కారును నిలదీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నమో టీవీ ప్రారంభించింది. ఈ విషయమై ఆగ్రహించిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఈసీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభను ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ దూరదర్శన్ కు కూడా తాఖీదు జారీచేసింది ఎలక్షన్ కమీషన్.

మొత్తంగాచూస్తే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గానీ, వారి మనసును మార్చేందుకు ఎవరు ఎలాంటి యత్నం చేసినా సహించేది లేదంటూ కొరడా ఝుళిపించేసింది ఈసీ. అసలే ఆధరణ లేక కొట్టుమిట్టాడుతున్న బీజేపీ పార్టీకి.. తీరా ఎన్నికలు దగ్గరపడిన ఈ వేళ ఇలాంటి సంఘటన ఎదురు కావడం చెంపపెట్టు లాంటింది. చూడాలి మరి దీనిపై మోడీ స్పందన ఎలా ఉంటుందో!