కేంద్ర బలగాలతో రఘురామరాజుకు భద్రత ?

August 05, 2020

అమెరికా నుంచి ఒక సామాజిక వర్గం వారు ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత అరాచకత్వమా? ఒక ఎంపీగా నా నియోజకవర్గానికి పోవాలి కదా. బట్టలూడదీసి కొడతారట. అందుకే ఎంపీలందరికీ పెద్ద అయిన లోక్ సభ స్పీకరుకు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

నాకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలి. అపుడే భద్రత ఉంటుంది అని ఆయన అన్నారు. నన్ను చంపేస్తామని బెదిరించిన వారిపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. నేను ఎస్పీకి లేఖ రాశాను. 

మా కులంలో చిచ్చు పెడుతున్నారు. నా కులం వారిని నాపై ఉసిగొల్పుతున్నారు. అలా చేయొద్దని కోరుతున్నాను అన్నారు.

ఆయన మరోసారి జగన్ ను పొగిడారు. సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు అవినీతి చేసిన జగన్ ఊరుకోరు అని అన్నారు. ఇళ్ల స్థలాల్లో అవినీతి నిజమే అన్నారు.

నాకంటూ కొన్ని వ్యక్తిగత అభీష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి కదా. నా వరకు నాకు అమరావతియే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

సీఎంతో భేటీకి సమయం ఇవ్వలేదని, ఇస్తే ఇపుడు కూడా జగన్ ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

నాలుగైదు రోజుకు నాకు భద్రత వస్తుందని అనుకుంటున్నాను. నన్ను బెదిరించడానికి ప్రయత్నించిన వారిని ఎవ్వరినీ వదలను అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.