జగన్ చెబితే విను... వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

July 12, 2020

ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్ పీపీఏలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రాసిన లేఖకు కేంద్రం నుంచి సీరియస్ రిప్లయి వచ్చింది. జగన్ నీకు తెలియదు, నేర్చుకో. పద్ధతి మార్చుకో అంటూ ఇంధన శాఖ నుంచి జగన్ కు రిప్లయి ఇచ్చారు. గతంలో పీఎంవో జగన్ లేఖను ఇంధన శాఖకు పంపగా.. ముందు మాటలతో రిప్లయి ఇచ్చినా జగన్ మారకపోవడంతో ఏకంగా లేఖ రాస్తూ... చంద్రబాబు కాలంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ పక్కాగా ఉన్నట్టు నిర్దారిస్తూ కేంద్ర ఇంధన శాఖ రిప్లయి ఇచ్చింది.

పీపీఏలు చాలా పక్కాగా ఉన్నాయని.. వాటిలో ఏ తప్పు జరగలేదని, అవన్నీ కేంద్రం నిర్ణయించిన ధరలు అని లేఖలో పేర్కొంది. 2016-17 ఒప్పందాల్లో ఏపీ రేటు 4.84 రూపాయలే అని, రాజస్తాన్, మహారాష్ట్రలో అయితే రూ.5 కంటే ఎక్కువ అని అన్నారు. పీపీఏల పున:సమీక్ష అంశం ఏదో మీ అంతర్గత వ్యవహారం కాదని... దానిపై తీసుకునే ప్రతి చర్యా దేశం మీద ప్రభావం చూపుతుందని లేఖలో ఇంధన శాఖ పేర్కొంది.

ఈ ధరలను సమీక్షిస్తే...పునరుత్పాదక విద్యుదుత్పత్తిపై, అన్ని పెట్టుబడులపైన, దేశ మొత్తం విద్యుత్ రంగంపైన తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని  కేంద్రం హెచ్చరించింది. ఇపుడు ధరలు ఎక్కువున్నాయని సమీక్షించడం తప్పు అని, ఎందుకంటే ఒప్పందం ఐదేళ్లకోసారి చేసుకుంటామని, కానీ ధరలు మాత్రం ఏటా మారుతుంటాయని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రం చెప్పినా జగన్ మూర్ఖంగా ప్రవర్తిసున్నారని, జగన్ తీరు దేశానికే ప్రమాదం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆయన మాటల్లో స్పందన చూస్తే...

కేంద్రం చివాట్లు, కోర్టుల మొట్టికాయలు ఏవైనా, వైసీపీ వాళ్ళకు దున్నపోతుమీద వాన చినుకులు పడినట్టే. పీపీఏల రద్దుపై కేంద్ర మంత్రి లేఖలు, కేంద్ర కార్యదర్శి లేఖలు, ఆర్ బీఐ, అప్పిలేట్ ట్రిబ్యునల్, పీఎంవో, విదేశీ ఎంబసీల సహా ఎందరు హెచ్చరికలు చేసినా అన్నింటినీ పెడచెవిన పెట్టారు.
ఇప్పుడు తాజాగా పీపీఏల రద్దుపై ప్రభుత్వాన్ని మూర్ఖంగా ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ లేఖ రాశారు. 3కంపెనీలకు తెలుగుదేశం ప్రభుత్వం దోచిపెట్టిందన్న వైసీపీ నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రుజువులతో సహా ఆ లేఖలో తెలిపారు. ఆర్ పీవో పైన, ధరలపైన, గ్యాస్ కేటాయింపులపైన, మస్ట్ రన్ పైన ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని ఆరోపణలు చేసిన అధికారులు ఇప్పుడేమంటారు? వాళ్లను ముందుపెట్టి జగన్నాటకం ఆడించిన వాళ్లేమంటారు? నిన్న హైకోర్ట్ జీవో 63ని కొట్టేయడం ఒక చెంపపెట్టు. ఈ రోజు కేంద్రమంత్రి ఆర్ కే సింగ్ లేఖ మరో చెంపపెట్టు. రోజురోజుకూ, పూటపూటా చెంపదెబ్బలు పడుతున్నా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పురాదు