ఎవరండీ ఆ ఐదుగురు.. చంద్రబాబు ప్రశ్న !

June 03, 2020

ప్రజాస్వామ్యంపై ఇసుమంత కూడా గౌరవం లేకుండా... నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను విలువలు, నీతి, ధర్నాలను మంటగలిపి ఓ పార్టీకి వంతపాడుతూ నిర్వహిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు ఘోరంగా, ప్రశ్నార్థకంగా ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు వేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రిని నిలదీశారు. 
* వైసీపీ నియమించిన ఎన్నికల ఇన్ ఛార్జిల్లో ఒక్కరు కూడా ఏపీ మంత్రులు లేరు. ఇలా ఎక్కడైనా చరిత్రలో జరిగిందా?. పోనీ మంత్రులు లేకపోతే లేకపోయారు... ప్రజానాయకులు అయినా అందులో ఎవరైనా ఉన్నారా? విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, వేమప్రభాకర్ రెడ్డి... వైవీ సుబ్బారెడ్డి. ఈ వైవీ సుబ్బారెడ్డి ఒక్కసారి ఎంపీగా గెలిచారు. మిగతా నలుగురు ప్రజానాయకులు కాదు, ఎన్నికల్లోనూ గెలవలేదు. వారిని ఎన్నికల ఇన్ ఛార్జిగా నియమించారు అంటే డబ్బు సంచులు మోయడానికి కాకపోతే ఇంకెందుకు అని చంద్రబాబు నిలదీశారు.* ఇది ప్రజల కోసం ప్రభుత్వం కోసం. వైసీపీ వాళ్ల కోసం నడుస్తున్న ప్రభుత్వం. ఎంత అరాచకం అంటే... ఎమ్మెల్యే అడిగితే రిజర్వేషన్లు మార్చేస్తారు. డీలిమిటేషన్ చేసేస్తారు. ఎన్నికల కోడ్ వచ్చాక హోర్డింగ్ లు తొలగించలేదు. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? * కుల ధ్రువీకరణ పత్రాలను వారికి కావల్సిన వారికి ఏర్పాట్లు చేసుకున్నారు. లోపాయకారిగా వ్యవహారం పూర్తి చేసుకున్నారు. ఆ పత్రాలు ఇచ్చే అధికారులను లీవుల మీద పంపేస్తున్నారు. సరిగ్గా 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ హడావుడిగా ముగించాల్సిన అవసరం ఏమొచ్చింది.? క్యాస్ట్ సర్టిఫికెట్లు దక్కకుండా చేసి ఎన్నికలకు దూరం చేద్దామనే కుట్ర ఇది. * మీకు దమ్ముంటే, ప్రజలు ఓట్లేస్తే గెలవండి.  ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి... డబ్బులు, మద్యం ఇష్టానుసారం పంపిణీ చేసి గెలవడానికి దొడ్డిదారులు వెతుకుతున్నారు.
జగన్ ఎలాగైనా పంచాయతీలు దక్కించుకోవాలని చేస్తున్న ప్రయత్నంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వెళ్లబుచ్చారు. ఇంత నియంతృత్వపు పోకడలు జగన్ లో చూసి మేము ఆశ్చర్యపోవడం లేదు. ఆయన పాలన ఇలాగే ఉంటుందని ముందే చెప్పాం. కానీ జనం నమ్మలేదు. ఇప్పుడు వారికి కూడా అర్థమైపోయింది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... జగన్ తెచ్చిన చట్టం బాగుంది కానీ... అది అధికార పక్షానికి కూడా వర్తింపజేస్తే ఇంకా బాగుంటుంది అని జగన్ పై జేసీ దివాకర్ సెటైర్ వేశారు.