సూపర్ ఫాస్ట్ గా చంద్రబాబు 

May 24, 2020

సాధారణంగా చంద్రబాబు.. అడ్మినిస్ట్రేటర్ మోర్ దాన్ ఎ పొలిటీషియన్. ఆయన ప్రభుత్వ వ్యవహారాలపై స్పందించినంత వేగంగా పార్టీ పరిణామాలపై స్పందించరు అని ఒక అపవాదు. అయితే... జగన్ పాలన చంద్రబాబులో మార్పు తెచ్చింది. ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలపై చంద్రబాబు అణువణువు గమనిస్తూ చాలా వేగంగా స్పందిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం అండ ద్వారా తెలుగుదేశం సానుభూతి పరులను వేధించే వైకాపా వారి మీద యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. పరిస్థితులను మీకు సరిదిద్దడం చేతకాలేదు కాబట్టే తాను రంగ ప్రవేశం చేసినట్టు కొన్నాళ్లు క్రితం చేసిన చంద్రబాబు అరాచకాలను సీరియస్ గా పరిగణిస్తున్నారు. 

ప్రభుత్వ బాధితుల పునరావాసం ఏర్పాటుచేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఏపీ సర్కారు బ్లేమ్ అయ్యింది. నేషనల్ మీడియా టాపిక్ అయ్యింది. సినిమాల్లో తప్ప మామూలుగా కనిపించని ఊరు వదిలి వెళ్లిపోయే సీన్లు ... గ్రామాల్లో రాజకీయాలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు ఎక్కడా ఇలాంటి సీన్లు కనిపించవు. చంద్రబాబు పార్టీని తిట్టిన క్షమిస్తాడు గాని శాంతి భద్రతల్లో విఫలం కావడాన్ని అసలు క్షమించడు అందువల్లే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఇలాంటి సీన్లు కనిపించవు. శాంతి భద్రతల విషయంలో సొంత వారు, వేరే వారు అనే వ్యవహారం బాబు సర్కారులో కనిపించదు. కానీ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అరాచకాలు చోటుచేుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పలేదు. శాంతియుతంగా ఉండాలని ఎవరినీ హెచ్చరించలేదు. పైగా సాక్షి పత్రికలోనే బాధితులపై నెగెటివ్ కథనాలు రావడంతో తమకు సీఎం మద్దతు ఉందని ఫీలైపోయిన అరాచకవాదులు పెచ్చరిల్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు.రేపు ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తలపెట్టారు. పల్నాడు ప్రాంతంలో గ్రామాలు విడిచిన బాధితులను పార్టీ స్వయంగా వారి గ్రామాల్లో దింపనుంది. పరిస్థితి విషమించడంతో ఇక దొరికిపోతాం అని భావించిన ప్రభుత్వం పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం ఇపుడు మొదలుపెట్టింది. తాజాగా నిన్న పోలీసులు 14 కుటుంబాలను సొంత గ్రామాల్లో వదిలిపెట్టి రాజీ చేయించారు. స్వయంగా చంద్రబాబు అనేక సార్లు హెచ్చరించినా పట్టించుకోని జగన్... చంద్రబాబు సీరియస్ డెసిషన్ తీసుకోవడంతో అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్నారు. అందుకే హోం మంత్రి ప్రెస్ మీట్ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెబుతుంటే... లోపాయకారీగా పోలీసులు చర్యలు మొదలుపెట్టారు.

మొత్తానికి చంద్రబాబు ఉద్యమ సెగ జగన్ సర్కారుకు తగిలింది.144 సెక్షన్ విధించినా... ఛలో ఆత్మకూరు కచ్చితంగా జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు. ‘‘గౌరవ హోంమంత్రి సుచరితగారు పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెబుతుంటే, పోలీస్ బాస్ డీజీపీ మాత్రం పల్నాడులో సాధారణ పరిస్థితులు లేవని అంటున్నారు. పల్నాడులో 144 సెక్షన్ ఉందని చెబుతున్నారు‘‘ ఎవరి  మాటలు నమ్మాలి? అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ భయం, జాగ్రత్త ముందే ఉండాల్సిందని లోకేష్ వ్యాఖ్యానించారు.