​చంద్రబాబు అడిగిన 3 ప్రశ్నలు... జగన్ వద్ద నో ఆన్సర్

June 02, 2020

కరోనా విషయంలో డిజాస్టర్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే... అది ఏపీ ముఖ్యమంత్రి ​జగన్ మాత్రమే. ప్రపంచం మొత్తం కరోనాకు వణికిపోతుంటే జగన్ మాత్రం ఇట్ కమ్స్ ఇట్ గోస్ అని చేసిన వ్యాఖ్యలతో ఇలాంటి వ్యక్తి చేతిలో మా ఆరోగ్యం ఉందా అని ఏపీ ప్రజలు వణికి పోయారు. ఇదిలా ఉంటే... రాష్ట్ర ప్రజల క్షేమం కూడా జాగ్రత్తలు తీసుకున్న ఎన్నికల కమిషనర్ ని వైసీపీ నేతలు బండబూతులు తిట్టారు. బెదిరించారు. ఆయన అభిమానులు అయితే చంపేసినా పాపం లేదన్నారు. కులాన్ని అంటగట్టారు. దీంతో ఆయన పేరుతో నాకు భద్రత కావాలంటూ ఒక లేఖ విడుదలైంది. అయితే... తాను విడుదల చేసినట్టు ఆయన చెప్పలేదు. దీంతో అది ఫేక్ అని కొందరు ప్రచారం చేశారు. కానీ ఆ లేఖ నిజమో అబద్ధమో తెలియదుగాని కేంద్ర హోంశాఖకు ఆ లేఖ చేరింది. వెంటనే హోం శాఖ స్పందించి ఎన్నికల కమిషనర్ కి భద్రత ఏర్పాటుచేసింది. 

దీనిపై చంద్రబాబు స్పందించారు. అసలు జగన్ సమస్య ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాను లెక్క చేయకుండా ఎన్నికలు నిర్వహించిన ఫ్రాన్స్ లో 900 మందికి ఎన్నికల వల్ల వ్యాధి సోకిందన్నారు. ప్రజలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ వ్యవహారంపై మూడు కీలకమైన అనుమానాలు చంద్రబాబు వ్యక్తంచేశారు. 

1. కేంద్ర ప్రభుత్వానికి లేఖ వెళ్లిందా? లేదా ? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని అడగలేదు?

2. విద్యా సంస్థలు, మాల్స్ తదితరాలు మూసేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తే... ఒక జగన్ మాత్రమే ఎందుకు దీనిని పెడచెవిన పెట్టారు. ?

3. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య మంత్రులు చాలా అలెర్ట్ గా ఉంటూ అందరినీ ఉరుకులుపరుగులు పెట్టిస్తే.... మన ఆరోగ్య మంత్రి ఈరోజు వరకు ఎందుకు బయటకు రాలేదు? 

ఈ మూడు అనుమానాలకు జగన్ వద్ద సమాధానం లేదు. కారణం ఏంటంటే... జగన్ ఎన్నికల గురించి తప్ప దేని గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు జరిగితే చాలు.. కరోనాలు గిరోనాలు తరువాత అనుకున్నారు.  అనుకోవడమే కాదు, అదే విషయాన్ని ఏకంగా మీడియాతో చెపి... ప్రపంచంలోనే కరోనాని అస్సలు లెక్క చేయని పాలకుడిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్.