ఏసీీబీకి చంద్రబాబు డైరెక్ట్ సవాల్

August 14, 2020

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

చెన్నైలో 5 కోట్లు పట్టుబడిన వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలపై సాక్ష్యాలు లేకుండానే కేసులు పెడుతున్న మీరు... సాక్ష్యాలు కళ్ల ముందున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏసీబీని డిమాండ్ చేశారు.

‘‘72 గంటలు గడిచాయి. బాలినేని కేసులో ఏపీ ఏసీబీ విభాగం ఏమీ స్పందించలేదు.

ఏసీబీ కేవలం టీడీపీ నేతలకు వ్యతిరేకంగా అక్రమ కేసులను మాత్రమే పెడుతుందా? అధికార పార్టీ నేతలు అవినీతి చేసినా, లూటీ చేసినా, అడ్డంగా దొరికని పట్టించుకోదా?

కళ్ల ముందు కనిపిస్తున్నదానికి ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు?

వైఎస్ జగన్ ఎందుకు బాలినేని పై ఇంకా చర్యలు తీసుకోలేదు‘‘ అని చంద్రబాబు ట్విట్టరులో ఏపీ ఏసీబీని, ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు.

మరోవైపు లోకేష్... దొరికినవి ఇన్ని, దొరకనవి ఎన్ని అంటూ ప్రశ్నించారు.

ఆ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో కూడా ఆయన ట్విట్టరులో వివరించారు.