విశాఖలో చంద్రబాబు అరెస్ట్

June 06, 2020
CTYPE html>
నిజంగానే ఈ వార్త బిగ్ బ్రేకింగేనని చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యారు. టీడీపీ చేపట్టిన జన చైనత్య యాత్రలో భాగంగా గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించేందుకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేందుకే దాదాపుగా రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత ఎలాగోలా ఆయన బయటకు వచ్చినా... ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెక్షన్ 151 కింద చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు... ఆయనను తిరిగి విమానాశ్రయంలోకి తరలించారు.
 
జగన్ సర్కారు చేపడుతున్న నిర్ణయాలను ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా అభివర్ణించిన టీడీపీ... అందుకు నిరసనగా జన చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రల్లో భాగంగా ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు... గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన నిమిత్తం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిని వ్యతిరేకిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు పర్యటననను అడ్డుకునేందకు ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు కూడా కదం తొక్కాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖకు వచ్చిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఓ వైపు చంద్రబాబును స్వాగతించేందుకు టీడీపీ శ్రేణులు, బాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు పోటాపోటీ నినాదాలు  చేశారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన చంద్రబాబును వైసీపీ అడ్డుకుంది. ఫలితంగా రెండు గంటలకు పైగా చంద్రబాబు ఎయిర్ పోర్ట్ ఎంట్రెన్స్ లో కారులోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటికే పరిస్థితులను పరిశీలిస్తున్న పోలీసులు... నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేసి తిరిగి ఎయిర్ పోర్టులోకి తరలించారు. ఎయిర్ పోర్టు నుంచే ఆయనను తిరిగి విజయవాడకో, లేదంటే హైదరాబాద్ కో పంపించనున్నారు.