కొత్త ఇంట్లో చంద్రబాబు పుట్టిన రోజు

June 02, 2020

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు ఈసారి తెలుగుదేశం అభిమానులు, చంద్రబాబు అభిమానులు వైవిధ్యంగా జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజును నాయకత్వ స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే చంద్రబాబు కూడా చాలా చిన్న కేకుతో హైదరాబాదులోని కొత్త ఇంట్లో  (గత ఏడాదే పాత ఇంటిని పడగొట్టి కొత్తది కట్టారు) భార్య, కొడుకు, కోడలి సమక్షంలో తన పుట్టిన రోజును సంతోషంగా జరుపుకున్నారు. 

చొక్కా ఆకారంలో తయారుచేసిన కేకుపై కేవలం ఒక కొవ్వొత్తి వెలిగించి ఉందా కేకు. చంద్రబాబు కేకు కట్ చేసి తన భార్య భువనేశ్వరికి తినిపించారు. ఆ తర్వాత కొడుకు లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి కూడా బాబుకు కేకు ముక్క తినిపించి జన్మదిన శుభకాంక్షలు చెప్పారు. 

చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టారు. తల్లిదండ్రులది సాధారణ కుటుంబం. అమ్మణమ్మ-ఖర్జూర నాయుడు బాబు తల్లిదండ్రులు. చదువంతా సొంత జిల్లాలోనే సాగింది. 1972లో బీ.ఏ పూర్తి చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీ లో ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 28 ఏళ్లకే టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రి అయ్యారు. తర్వాతి కాలంలో ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎం అయ్యారు. విభజన తర్వాత ఏపీకి తొలి సీఎం అయ్యారు. తక్కువ తినడం, ఎక్కువ గంటలు పనిచేయడం ఆయన శైలి. గొప్ప వక్త కాకపోవడం ఆయన బలహీనత. మిగతా ఏ విషయాల్లో అయినా ఇండియాలో టాపే. ప్రపంచంలో అత్యధిక దేశాల ప్రతినిధులను కలిసిన పాపులర్ ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇపుడు ఆయన కు 69 ఏళ్లు నిండాయి. 70వ ఏడాదిలోకి అడుగుపెట్టారు.