మీకు చేతకాకపోతే నా దమ్మేంటో చూపిస్తా - చంద్రబాబు

May 26, 2020

 పోలీసులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాాల కోసం న్యాయం, ధర్మం మరిచిపోతున్నారు. ఆత్మకూరుకు చెందిన వైసీపీ బాధితులను తిరిగి తగిన భద్రతతో భరోసా ఇచ్చి వారి ఊరికి పంపించాలని అల్టిమేటం ఇచ్చాను. తాత్కాలిక ప్రయోజనాలకు కకృతి పడి న్యాయాన్ని గాలికి వదిలేయకండి. మీకు దమ్ములేకపోతే... ఆ పనినేను చేసి చూపిస్తా. స్వయంగా నేనే వారిని తీసుకెళ్లి సురక్షితంగా ఊరిలో దింపొస్తా. త్వరగా తేల్చుకోండి అని చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని చెప్పిన జగన్ మూడు నెలల్లోనే మూర్ఖపు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం, వినాశనం మాత్రమే చంద్రబాబుకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత బాబాయిని చంపిన నిందితులను పట్టుకోెలేని దద్దమ్మలు... టీడీపీ సామాన్య కార్యకర్తలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. సామాన్య టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తే చూస్తూ ఊరుకోను. ప్రభుత్వ బాధితుల కోసం పునరావాసం ఏర్పాటుచేయాల్సిన పాలన రాష్ట్రంలో సాగిస్తున్నందుకు జగన్ సిగ్గుపడాలి అని చంద్రబాబు విమర్శించారు.

పోలీసులు చేయలేని పని ఛలో ఆత్మకూరు పేరుతో తాను చేస్తానని... మీకు ఏమీ చేతకాదు, మీ బాబాయి కేసును కూడా సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మనుషులను చంపుతున్నారు. ఏకంగా రాజధానిని చంపుతున్నారు. ఎన్నికల ముందు మేము చెప్పినట్టే జరుగుతోంది. అరాచకపాలనకు జగన్ అడ్రెస్ గా మారారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలను కూడా అరాచకాలతో జగన్ కలుషితం చేశాడని చంద్రబాబు ఆరోపించారు.