ఇన్నాళ్లకు జగన్ ని ఇరుకున పెట్టిన చంద్రబాబు

July 16, 2020

రాజకీయ నాయకుడి బలం డబ్బో, పవరో కాదు. తూటా వంటి మాట. ఈరోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపించి సాధించారంటే... అందులో ప్రధాన పాత్ర కేసీఆర్ వాగ్దాటిదే. మాట కంటే పవర్ ఫుల్ ఏమీ ఉండదు. కత్తులను, తుపాకులను కూడా ఆపగలిగిన శక్తి మాటది. కానీ అదే చంద్రబాబు బలహీనత. వాస్తవానికి బాబు విధానాలు ఎక్కువ మేలు చేస్తాయి కానీ... జనాలు బాబు నచ్చడు. దీనికి కారణం తాను చేసిన పనిని ఎఫెక్టివ్ చెప్పుకునే చాణక్యం చంద్రబాబు వద్ద లేకపోవడమే. ఆయనకు పని సాధించే విధానం తెలుసు. కానీ దానిని ఎక్స్ ప్రెస్ చేసే విధానం తెలియదు.

ప్రతి విషయంలో మాటిమాటికి స్పందిస్తూ... నిత్యం మీడియా ముందు ఉండటం వల్ల చంద్రబాబు రాకపై గాని, మాటపై గాని అటు మీడియాకు ఇటు ప్రజలకు ఆసక్తి తక్కువ. రిపిటీషన్ ఎక్కువ. దీనివల్ల అపుడపుడు బాబు గొప్ప ప్రసంగాలు ఇచ్చినా అవి మరుగున పడిపోతాయి. గత కొన్ని రోజులుగా నిర్విరామంగా అమరావతి ఉద్యమానికి అండగా నిలిచి పోరాడుతున్న చంద్రబాబు... ఈరోజు జగన్ కు నోటి మాట రాని సవాల్ విసిరారు. దీనిని తెలుగుదేశం నేతలు గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘రాజధానికి మీరు ఒక కులం అంటగట్టారు. సరే. మీకు సవాలు విసరుతున్నాను. రాజధాని మార్పును రెఫరెండంగా పెట్టి ఇపుడు ఎన్నికలకు వెళ్లండి. మీరు కనుక మళ్లీ గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను’’ అని చంద్రబాబు సవాల్ విసిరారు.

ఇంతటి పవర్ ఫుల్ ఛాలెంజ్ ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎపుడూ చేయలేదు. ఈ సవాల్ కు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఒక్క ఛాన్స్ అని ఇస్తే... ఏపీని ఎలా పురోగమనంలోకి తీసుకెళ్లాడో అందరకి అర్థమైపోయింది. అమరావతి రెఫరెండం అని చంద్రబాబు అంటున్నారు గాని ఏ రెఫరెండం లేకుండా ఓటింగ్ కు ెవెళ్లినా కూడా జగన్ మళ్లీ ఏపీలో గెలవలేనంత వ్యతిరేకత పోగేసుకున్నాడు జగన్. ప్రతి పథకంలో కోత. హామీలు తప్పడం, అభివృద్ధి ఆగడం ఒకటి రెండు కాదు  ఏడు నెలల్లో ఏపీలో ఎంత రచ్చ చేయాలో అంత చేసేశాడు వైఎస్ జగన్. అందుకే ఈరోజు చంద్రబాబు విసిరిన సవాల్ కు స్పందించే పరిస్థితిలో జగన్ లేదు. ఆయన పార్టీ కూడా లేదు. 

చంద్రబాబు అపుడపుడు మాట్లాడినా... వైసీపీ నోరుు మూయించగలిగిన ఇలాంటి వ్యాఖ్యలు, చురకలు వేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. 

 

Read Also

జగన్ రాజధాని విశాఖకు పాకిస్తాన్ నుంచి ముప్పు
మళ్లీ టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్య: సీనియర్ టీడీపీ నేత
అమ‌రావ‌తి మార్పు వెనుక క్రైస్త‌వ మిషిన‌రీలు?