జగన్ దమ్ముంటే... ఆ పని చేసి చూపెట్టు

May 26, 2020

సాధారణంగా ఏ విషయం అయినా కాస్త గట్టిగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చారు. కానీ జగన్ కి ఈరోజు ట్విట్టరులోనే గట్టి ఛాలెంజ్ విసిరారు. ఉద్యోగాల విషయంలో జగన్ చేస్తున్న భారీ పొరపాటును గుర్తుచేస్తూ.. విమర్శించారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ట్విట్టరులో స్పందించినట్టు ఉన్నారు.
ప్రభుత్వ విధానం బాగలేదని, ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లను తీసేసి... మరొకరికి ఉద్యోగం ఇవ్వడం ఏంటని... తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులు హాహాకారాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఒకరి ఉద్యోగం తొలగించి మరొకరికి ఇవ్వడం ఏం ఉద్యోగాల కల్పన? అంటూ ప్రశ్నించారు. పైగా భారీగా ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం ఏం పిచ్చిపని అని దుయ్యబట్టారు.
కొత్త ఉద్యోగాలు సృష్టించడం చేతకానపుడు సైలెంటుగా ఉండాలి, కానీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు.

ఇదీ చంద్రబాబు వేసిన ట్వీట్
"మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగేవాళ్లే లేరని భావిస్తున్నారా? ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అయినా, తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది సీఎం ఇల్లా? లేక లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?" అంటూ చంద్రబాబు వరుస ట్వీట్ చేశారు.

చంద్రబాబుకు ఎన్నికల్లో ఓడిపోయిన బాధను తన పాలనతో జగన్ తొలగించారు. ఇంత త్వరగా తెలుగుదేశం శ్రేణులు చైతన్యం కావడానికి జగన్ అవకాశం ఇస్తారని చంద్రబాబు ఊహించలేదు. అయితే, రెండు నెలల్లోనే చంద్రబాబు ఐదేళ్లలో చేసిన తప్పులు చేశారు జగన్. గతంలో ప్రతి దానికి కోతలు పెడతాడని చంద్రబాబును విమర్శించిన జగన్... అదే బాటలో నడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబే తక్కువ కోసేవారు. కానీ జగన్ మొహమాట పడటం లేదు. ఎలా చూసినా ప్రతి రంగం జగన్ పాలనలో అసంతృప్తితో ఉంది.