వైసీపీ దారి దొడ్డి దారి- చంద్రబాబు

August 10, 2020

అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

మీకు ఎంత ధైర్యముంటే సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను దొడ్డిదారిని మండలికి తెస్తారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

నీతి లేదు, ప్రజాస్వామ్య పద్ధతి లేదు. కరోనా సమయంలో రాజధాని తరలింపునకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అడిగే వాళ్లు లేరని ఇష్టానుసారం చేస్తున్నారు. 40 ఏళ్లలో ఎన్నో చట్టసభలు చూశాను.

కానీ ఇంత దారుణంగా ఎవరూ వ్యవహరించలేదు అని చంద్రబాబు విమర్శించారు.

18 మంది మంత్రులకు మండలిలో ఏం పని అంటూ చంద్రబాబు లాజిక్ తో నిలదీశారు.

ఇది ఎపుడూ జరగదు. జరగకూడదు అన్నారు. బజారు రౌడీల్లా బలప్రయోగం కోసం అంత మంది మండలికి వచ్చారా అని చంద్రబాబు ఆరోపించారు. 

ఈరోజు చంద్రబాబు గవర్నర్ హరిచందన్ ను కలిశారు. వైసీపీ పై 14 పేజీల ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. 

ఏడాదిగా వైసీపీ చేసిన తప్పుడు పనులు, తప్పుడు విధానాలు అందులో వివరించినట్లు చంద్రబాబు తెలిపారు.

800 మంది టీడీపీ కార్యకర్తలు ఏడాదిలో వైసీపీ చేత దాడులకు గురయ్యారని చంద్రబాబు ఆరోపించారు.

ఇదిలా ఉండగా... బీద రవిచంద్ర మండలి గొడవపై స్పందించారు.

మామీద చెయ్యిచేసుకున్నారు. ఊరికే ఉండటానికి మేము గాంధీలం కాదు కదా అని అన్నారు.

అధికారం వారి చేతిలో ఉంది. అసలు లైవ్ ఎందుకు పెట్టలేదు. ఇప్పటికైనా ఏముంది? మండలి టీవీ ఫుటేజ్ బయట పెట్టండి.. ఏం జరిగిందో జనమే తెలుసుకుంటారు అని బీదరవిచంద్ర నిలదీశారు.