’ఇవి జగన్ గవర్నమెంట్ కిడ్నాపులు‘

August 13, 2020

ప్రభుత్వం నడపడం రాక విమర్శలు చేస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. పాలన చేతగాక... గవర్నమెంట్ స్పాన్సర్డ్ కిడ్నాపులకు పాల్పడుతున్నారా? మైరా మీడియాకు చెందిన నలుగురు వ్యక్తిని అరెస్టు చేసి నంద్యాలలో దాచిపెట్టారు. ప్రజల వాయిస్ రికార్డు చేసి ప్రపంచానికి వినిపించడం వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు చంద్రబాబు. 

ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలు ఒత్తిడితో నంద్యాల పోలీసులు అక్రమంగా మైరా మీడియాకు చెందిన నలుగురు రవి బంధువులను నిర్బంధంచడం జగన్ నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు అంతటితో కూడా ఆగలేదు. రవి కుటుంబ సభ్యులను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఇదేమైనా రాచరికం అనుకుంటున్నారా? ఈ నీచమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అప్రజాస్వామికంగా మీరు చేసిన ఈ దారుణలను సరిదిద్దుకోండి. పార్టీ తరఫున ఈ గవర్నమెంటు కిడ్నాపులపై మానవ హక్కుల సంఘానికి, కోర్టుకు వెళ్తాం. ఈ దుర్మార్గంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోకతప్పదు అని చంద్రబాబు హెచ్చరించారు.

లోకేష్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షిలో నిత్యం అసత్యాలే వండుతున్నారు. మీరు ఎదుటివారు తప్పులను ఎత్తి చూపుతారంటే ఎవరూ నమ్మరు. క్షేత్రస్థాయిలో జనం చెప్పింది ప్రసారం చేయడం కూడా తప్పంటే... ఇంతకంటే దారుణం ఎక్కడా ఉండదు. పోలీసు వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. దేశ ద్రేహులను పట్టుకున్నట్లు అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి భయానక వాతావరణాన్ని సృష్టిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా అని జగన్ ప్రశ్నించారు. మీరు పులి అని చెప్పుకుని తిరుగుతూ... పిల్లిలా జనాల్ని చాటు గా వచ్చి నిర్బంధిస్తారా? అంటూ లోకేష్ జగన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏమిటీ మైరా మీడియా..

మైరా మీడియా ఒక యుట్యూబ్ ఛానెల్. అదేమీ ప్రభుత్వ స్కాముల్ని శోధించడం లేదు. కేవలం గ్రామాల్లో జనాల వద్దకు వెళ్లి... ప్రభుత్వ పథకాలు, పాలన గురించి అభిప్రాయం అడుగుతుంది. జగన్ పాలన ఎలా ఉంటే జనం అలా స్పందిస్తారో... అయితే...ఇటీవల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయి జగన్ పాలనపై వారు శాపనార్థాలు పెడతున్నారు. దీనిని తట్టుకోలేని ప్రభుత్వం వ్యతిరేక వార్తలు వినిపించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. జగన్ పార్టీ విధానం ఎలా ఉంది అంటే... అరచేత్తో సూర్యడిని అడ్డుకోవాలను చూస్తోంది. ఇలా చేసిన వారంతా ఎపుడో చరిత్రలో కనపడకుండా పోయారు.