43 వేల కోట్ల దొంగ... లక్ష ఫర్నీచర్ కోసం కేసుపెట్టి చంపాడు

May 31, 2020

కోడెల మృతి చంద్రబాబును తీవ్రంగా కలచివేసినట్టు ఉంది. నింద మోపే వాడిని బట్టి దానిని పట్టించుకునే నైజం చంద్రబాబుది. కానీ... నిందను మాత్రమే చూసి కుమిలిపోయి తనువు చాలించాడు కోడెల. 71 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత వేధింపులకు ప్రభుత్వం గురిచేయడం చంద్రబాబును తీవ్రంగా కదిలించింది. అందుకే మరోసారి దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.

43 వేల కోట్ల దొంగ, బెయిలుపై బయట తిరుగుతున్న వ్యక్తి, 11 ఛార్జిషీట్ల ముద్దాయి... లక్ష రూపాయల ఫర్నీచర్ దొంగతనం కేసును ఒక సీనియర్ నాయకుడిపై మోపి ఇంత అవమానించి చంపేస్తారా అంటూ చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇది నూటికి నూరు శాతం ప్రభుత్వ హత్య అని... కేవలం ప్రభుత్వ ఉద్దేశపూర్వక వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందులో నిజాలు తేల్చడానికి సీబీఐ విచారణకు ఈ కేసును బదిలీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఐఏఎస్ లు, పోలీసులు సరెండర్ అయ్యారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

దేశ చరిత్రలో ఇది ఒక అమానవీయ చర్య అని, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అందరూ కోడెలను వేధించారని చంద్రబాబు అన్నారు. కోడెల మృతిపై మేధావులు చర్చించి స్పందించాలన్నారు. ప్రభుత్వం, వైసీపీ తప్పంతా చేసి మనిషి మరణానికి కారణం అవడమే కాకుండా కొడుకు, కూతురుపై నేరం మోపాలని ప్రయత్నించడం దారుణమైన విషయంగా పేర్కొన్నారు చంద్రబాబు. ఇది టెర్రరెస్టు ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా వ్యవహరించదని... అంతకంటే ఎక్కువే అన్నారు. 

నిన్నటి నుంచి చాలా కలతకు గురయ్యానని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, తన సహచర నేత ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోతే ఏమీ చేయలేమా? అని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం ప్రభుత్వం పెట్టిన కక్ష సాధింపుల కేసు, దానిపై వైసీపీ నేతలు పబ్లిగ్గా చేసిన గొడవ వల్ల అవమానభారంతో కుంగిపోయి నిద్ర కూడా పట్టక ఆవేదన చెందారని... చివరకు ఇలా బలవన్మరణం పొందారని చంద్రబాబు అన్నారు. ఇదొక నీచమైన పాలన అని చంద్రబాబు చెలరేగిపోయారు.

Read Also

డియర్ ఇండియన్స్.. మరో డేంజర్ బెల్ కు రెడీ కండి
శవాలపై జగన్ చిరునవ్వులు
ఏపీలో రాక్షస హింస - టెర్రరిస్టు పాలన : చంద్రబాబు