వైజాగ్ మృతులకు కోటి... ప్రకాశంలో 25 లక్షలిస్తావా జగన్?

June 05, 2020

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జనం కూడా ఈ డిమాండ్ ను సమర్థిస్తున్నారు. అక్కడా అమాయకులు చనిపోయారు. ఇక్కడా అమాయకుల ప్రాణాలు పోయాయి. అక్కడ కోటి ఇచ్చావు ఇక్కడ ఎంతిస్తావు జగన్ అని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం మృతులకు కేవలం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. విమర్శలు రావడంతో 10 లక్షలు ఇస్తామని పేర్కొంది. విశాఖ లో కోటి ఇవ్వడానికి ఇక్కడ 10 లక్షలు ఇవ్వడానికి ఏంటి కారణం అని జనం ప్రశ్నిస్తున్నారు. 

సోమశిలలో నీళ్లు అమ్ముకున్నట్టు వార్తలు విన్నాను. అంతకంటే అరాచకం ఏముంటుందని ప్రశ్నించారు. వేసవి వచ్చినా తాగునీటి చెరువుల్లో కూడా ఈ ప్రభుత్వం నీళ్లు నింపలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. సాగునీటి, తాగునీటి విషయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు హెచ్చరించారు. 

సరైన సమయంలో స్పందించి ఏపీలో వ్యవసాయానికి ఇబ్బందులు రాకుండా కాపాడాలని అన్నారు.