బాబు డిమాండ్... అందరికీ నచ్చింది, వైరల్ అవుతోంది

August 15, 2020

ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగుల్ని వేసేలా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి తొలుత ఏపీ హైకోర్టులోనూ.. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే. తొలుత పార్టీకి చెందిన మూడు రంగులతో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేయటంపై అభ్యంతరం వ్యక్తం కావటం.. తర్వాత నాలుగు రంగులతో ప్రభుత్వ కార్యాలయాల్ని సిద్ధం చేయటం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడాది జగన్ పాలనలో తప్పుల మీద తప్పులు చేస్తున్నారన్నారు. ప్రజాధనాన్నివేస్ట్ చేశారన్న ఆయన.. తప్పుల మీద తప్పులు చేయటంలో శిశుపాలుడ్ని మించిపోయారన్నారు. ప్రాథమిక హక్కుల్ని కాలరాయటం.. రాజ్యాంగ.. న్యాయ నిబంధనల్ని ఉల్లంఘించటం.. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని విమర్శించారు.

పార్టీ రంగులు వేయటానికి ఇంత దుర్మార్గమా? దేశంలో మరే రాష్ట్రం ఇలా చేయలేదన్న చంద్రబాబు.. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో రంగుల కోసం పెట్టిన ఖర్చును జగన్ పార్టీ చెల్లించాలన్న కొత్త డిమాండ్ నుతెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసే దుస్సాహసం ఎవరూ చేయలేదంటున్న చంద్రబాబు.. రంగుల ఖర్చును జగన్ పార్టీ భరించాలన్న వాదనకు బాగా మద్దతు లభిస్తోంది.

కోర్టుకు వెళ్తే ఈ కేసు నిలవదు అని తెలిసినా ఇలా చేశారు కాబట్టి... రంగుల ఖర్చు జగన్ సొంత డబ్బులు, పార్టీ డబ్బులు పెట్టుకోవాలని చేస్తున్న డిమాండ్ సరైనదే అని చెప్పొచ్చు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇది సోషల్ మీడియాలో అందరూ డిమాండ్ చేస్తున్నారు.