మళ్లీ టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్య: సీనియర్ టీడీపీ నేత

July 16, 2020

గుంటూరు జిల్లా నేత రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ - బీజేపీ - జనసేనలు మళ్లీ త్వరలో కలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ మోదీతో కలవాల్సిన అవసరాన్ని మేము చంద్రబాబుకు సూచిస్తామని... చెప్పారు. గతంలో చంద్రబాబు బీజేపీతో విభేదించి తప్పు చేశారని సాంబశివరావు వ్యాఖ్యానించారు. సీనియర్లు అందరూ కలిసి మళ్లీ ఇరు పార్టీల మధ్య సత్సంబంధాల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామని అన్నారు. 

పులివెందులలో రాజధాని పెట్టుకున్నా పర్లేదు గాని మూడు రాజధానులు మాత్రం వద్దని రాయపాటి అన్నారు. అమరావతిలో ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని... ఇది తీవ్రమైన చర్య అన్నారు. పోలీసులను అందరూ కలిసి ప్రతిఘటించాలని.. శృతిమించితే  తిరగబడాలని సూచించారు.  

ఇదిలా ఉండగా... బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... అమరావతి గురించి క్లారిటీ ఇచ్చారు. అమరావతి అనేది ఒక చంద్రబాబు నిర్ణయం కాదని... అందరినీ సంప్రదించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టే ఆనాడు ప్రధాని హోదాలో మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని కన్నా తెలిపారు. అసెంబ్లీలో అన్ని పార్టీల అంగీకారం తర్వాత అమరావతి రాజధానిగా నిర్ణయమైందన్నారు కన్నా. జగన్ ది నియంతృత్వ ధోరణి అని.. మహిళలపై పోలీసులను ప్రయోగించడం నూటికి నూరు శాతం తప్పు అన్నారు. ఆ మహిళలది శాంతియుత ధర్నా. వారు ఏమీ తగలబెట్టలేదు, ధ్వంసం చేయలేదు. తమ గొంతు వినిపిస్తున్నారు. అంతకుమించి ఏం లేదు... అలాంటి వారిపై పోలీసు చర్య ఏంటి అని కన్నా ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Read Also

అమ‌రావ‌తి మార్పు వెనుక క్రైస్త‌వ మిషిన‌రీలు?
అమరావతి ధర్నాలు - ఆ పుకారు నిజం కాదు
ఎస్వీబీసీ చానల్ బాధ్యతలు ఆ దర్శకుడికా?