బాబు సంచలన నిర్ణయం... వారికి చెరో లక్ష

February 24, 2020

మొండితనం రాజుకంటే గొప్పది కావచ్చు... కానీ రాజు మొండితనాన్ని గెలవడానికి కూడా ఒక మార్గముంటుంది. అదే అహం మీద దెబ్బతీయడం. చంద్రబాబు తాజాగా ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రజలు ఎలా పోతే నాకేంటి? ఇసుక లేక జనాలు చస్తే నాకేంటి? నేను చేయాలనుకున్నది చేస్తాను అన్నట్టు ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్ష నేత చంద్రబాబు భారీ ఝలక్ ఇచ్చారు. 

కొంతకాలం ఇసుక లేక ఉపాధి కోల్పోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వారిని ఆదుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరైన ప్రణాళిక లేకుండా ప్రభుత్వ వ్యవహరించడంతో ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. వర్షాలు వచ్చినపుడు ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడటం మామూలే. అయితే... ప్రతిసారీ దీనిని ఎలా ఎదుర్కొంటారంటే.. వర్షాకాలానికి ముందే నిల్వలు ఏర్పాటుచేస్తారు. అయితే... జగన్ వచ్చిన వెంటనే ఇసుక మైనింగ్ రద్దు చేశారు. దీంతో వర్షాలు భారీగా కురిసే వరకు ఇసుక పాలసీ రాలేదు. దీంతో ఇసుక పక్కకు తీసిపెట్టుకునే అవకాశం లేదు. ప్రభత్వ పెద్దలకు అవగాహన లేకపోవడం వల్ల లక్ష్లల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలామంది చనిపోయారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిదనే చెప్పాలి. వారికి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం జంకుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడుచంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇసుక కొరత వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పార్టీ తరఫున లక్ష రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. దీంతో ప్రభుత్వానికి ఇది తలతీసేసినట్టయ్యింది. ఇపుడు ప్రభుత్వం ఆదుకున్నా కూడా ఇరుక్కుంటుంది. ఈ సింపుల్ నిర్ణయంతో చంద్రబాబు మార్కులు కొట్టేయడమే కాదు, జగన్ ను ఇరికించారు. 

మరోవైపు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఇసుక కార్మికుల కోసం జనసేన ఏర్పాటుచేసిన లాంగ్ మార్చ్ కు తెలుగుదేశం మద్దతు ఇస్తుందని చంద్రబాబు ప్రకటించారు. తమ పార్టీ తరఫున కొందరు సీనియర్ నాయకులు ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొంటారని చంద్రబాబు ప్రకటించారు. మొత్తానికి షార్ప్ డెసిషన్ తో ప్రభుత్వానికి చంద్రబాబు మూడు చెరువుల నీళ్లు తాగించారు.