చంద్రబాబు కీలక నిర్ణయం...

August 05, 2020

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రైతు నాగేశ్వరరావుకు సాయపడిన సోను సూద్ ని ఫోన్ చేసి అభినందించారు. వారి బాధను తన బాధగా బావించి స్పందించిన సోను సూద్ స్పందించిన తీరు స్ఫూర్తి దాయకం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. వ్యవసాయంలో ఎడ్లు లేక తండ్రికి తామే కాడెద్దులై ఎలాంటి శషభిషలు లేకుండా సాయపడిన ఆ కూతుర్లను అభినందించిన చంద్రబాబు వారి చదువు ఖర్చులన్నీ ఇకపై తానే భరిస్తాను అని హామీ ఇచ్చారు. ఇటీవలే రాజమండ్రి దళిత బాలికను దత్తత తీసుకున్న చంద్రబాబు కొద్దిరోజుల్లో తీసుకున్న మరో దాతృత్వ నిర్ణయం... అభినందనీయం. 

ఇతరులపై ఆధారపడకుండా తమకు లేదు అని బాధపడకుండా తమంతట తాము పనిచేసుకుంటూ పోయిన ఆ కుటుంబానికి సోను సూద్ ట్రాక్టరు పంపిన విషయం తెలిసిందే. మనసులో స్వచ్ఛత ఉంటే మనకందాల్సిన సాయం దానంతటదే అందుతుంది అని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.

చంద్రబాబు, సోనుసూద్ ల దాతృత్వానికి అచ్చెరువొందుతూ ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిజమైన పేదలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వ ఏదో పేరుతో తన వర్గాలకు, తన ఓటర్లకు డబ్బులు పంచడంలో నిమగ్నమై అందరినీ అక్కున చేర్చుకోవడంలో విఫలం అవుతోంది అని నారా లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.